తోటను వెంటాడుతున్న పాతికేళ్ళ కేసు?

మాజీ ఎమ్యెల్యే ప్రస్తుత ఎమ్యెల్సీ తోట త్రిమూర్తులను పాతికేళ్ల క్రితం కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. దాంతో ఆయన ఎమ్యెల్సీ గా ఎన్నికయ్యానన్న సంతోషం పూర్తిగా లేకుండా [more]

Update: 2021-07-15 12:30 GMT

మాజీ ఎమ్యెల్యే ప్రస్తుత ఎమ్యెల్సీ తోట త్రిమూర్తులను పాతికేళ్ల క్రితం కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. దాంతో ఆయన ఎమ్యెల్సీ గా ఎన్నికయ్యానన్న సంతోషం పూర్తిగా లేకుండా పోయింది. తోట తోట త్రిమూర్తులుపై అటు విపక్షం లోను ఇటు స్వపక్షంలోను రాజకీయ ప్రత్యర్ధులు గట్టిగానే ఉన్నారు దాంతో ఆయనపై ముప్పేట దాడిగా విమర్శల వర్షం తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తుంది. ఎమ్యెల్సీగా తోట ను ఎంపిక చేసిన వెంటనే ఆయనను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుపడేందుకు పాత కేసులను ప్రత్యర్ధులు గవర్నర్ దృష్టి లో పెట్టారు. ఇందులో ముఖ్యమైంది దళితుల శిరోముండనం కేసు. వ్యవహారం సంక్లిష్టంగా మారడంతో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రంగంలోకి దిగి గవర్నర్ తో భేటీ అయ్యి క్లారిటీ ఇచ్చేశారు. దాంతో తోట తోట త్రిమూర్తులు ఎమ్యెల్సీ గా పదవీస్వీకారం చేసేసారు.

వేడెక్కిన తూర్పు …

తూర్పుగోదావరి జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు అత్యధికంగా ఉంటారు. ఇందులో కాపు, బిసి, ఎస్సి సామాజిక వర్గాల హవా నడుస్తుంది. కాపు సామాజికవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా ఉన్న తోట త్రిమూర్తులు మూడు దశాబ్దాలుగా జిల్లాలో తనదైన రాజకీయాలే సాగిస్తున్నారు. ఆయన వైసిపి లో చేరిన తరువాత జగన్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి కమ్మ సామాజికవర్గం స్థానంగా ముద్రపడిన మండపేట లో మునిసిపాలిటీ లో అత్యధిక స్థానాలు గెలిచి ఫ్యాన్ పార్టీ జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ తోట తోట త్రిమూర్తులుకు పదవిని సైతం కట్టబెట్టారు. మండపేట తో పాటు అమలాపురం పార్లమెంట్ స్థానం పార్టీ బాధ్యతలను ప్రస్తుతం తోట త్రిమూర్తులు పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తోటకు ఇచ్చిన ఎమ్యెల్సీ తో పార్టీకి జిల్లాలో జోరు మరింత పెరుగుతుందన్నది వైసిపి అధినేత అంచనాగా ఉందని భావిస్తున్నారు. అయితే ఆయన బాధ్యతలు ఇలా చేపట్టారో లేదో వైసిపి కి ఆయువు పట్టుగా ఉండే దళిత సామాజికవర్గాన్ని ఇదే అదనుగా చీల్చాలన్న ఎత్తుగడలతో రాజకీయాలు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళితులు నిత్యం ధర్నాలు, ర్యాలీలతో తోట తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా ఎక్కడో అక్కడ ఆందోళన సాగిస్తూ తోటకు పాత కేసు తలనొప్పి కొనసాగేలా చేస్తున్నారు.

టిడిపి లో ఉన్నప్పుడు పవిత్రం …

తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా దళితుల శిరోముండనం కేసు పై ఇంత రాద్ధాంతం జరిగింది లేదు. అప్పుడు ఆయన పవిత్రుడు అన్నట్లు వ్యహరించడాన్ని వైసిపి ఎత్తిచూపుతుంది. శిరోముండనం కేసు పాతికేళ్ళు అవుతున్నా ఇంకా ముందుకు సాగలేదు. నాడు ఈ కేసు పై ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు తోట తోట త్రిమూర్తులు బద్ద రాజకీయవిరోధి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే పోరాటం చేసేవారు. తోట తోట త్రిమూర్తులు వైసిపి లో చేరినా ఈ కేసు విషయంలో రాజీ పడబోనని బోస్ గతంలోనే ప్రకటించినా ప్రస్తుత పరిణామాల రీత్యా సైలెంట్ గా వ్యవహారం గమనిస్తున్నారు. అయితే దళిత సంఘాలు మాత్రం తోట ఎమ్యెల్సీ వ్యహారాన్ని ఎక్కడో అక్కడ రచ్చ చేస్తూనే వస్తున్నాయి.

అక్కడ సన్మానం …. ఇక్కడ రాద్ధాంతం …

రాజకీయాన్ని రాజకీయంతో తిప్పికొట్టాలన్న వ్యూహంతో తోట త్రిమూర్తులు తాజాగా వైసిపి దళితులతో సన్మాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేయించుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అనుకున్నట్లే ఆయన వ్యతిరేక దళిత వర్గాలు అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టాయి. దాంతో మండపేట లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ మొత్తానికి తోట తోట త్రిమూర్తులు సన్మానం సజావుగానే నడిచింది. పదవిలోకి వచ్చి పదిరోజులు పట్టుమని కాకుండా ఎక్కిన రోజునుంచి వివాదాలు తోటను చుట్టుముట్టడమే కాదు వైసిపి ని డిఫెన్స్ లో పడేశాయి. అయితే వీటన్నిటికీ సీనియర్ రాజకీయ వేత్త తోట త్రిమూర్తులు ఎలా చెక్ పెడతారో చూడాలి. నిర్ణయం తీసుకున్నాకా వెనక్కు తగ్గే అలవాటు లేని జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం.

Tags:    

Similar News