ఆయన దూకుడుతో తుమ్మల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కొలాప్సేనా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్పలేరు. నిన్న నాయ‌కుడు నేడు కార్యక‌ర్త స్థాయికి ప‌డి పోవ‌చ్చు. నిన్నటి మంత్రి నేడు సాధార‌ణ నాయ‌కుడు కావొచ్చు. రాజ‌కీయాల్లో [more]

Update: 2020-04-24 00:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్పలేరు. నిన్న నాయ‌కుడు నేడు కార్యక‌ర్త స్థాయికి ప‌డి పోవ‌చ్చు. నిన్నటి మంత్రి నేడు సాధార‌ణ నాయ‌కుడు కావొచ్చు. రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందో చెప్పడం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో మూడున్నర ద‌శాబ్దాలుగా ఏక‌చ‌క్రాధిప‌త్యంగా చ‌క్రం తిప్పిన సీనియ‌ర్ పొలిటీష‌య‌న్ తుమ్మల నాగేశ్వర‌రావు. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో అంతా తానే అయి చ‌క్రం తిప్పిన ఆయ‌న 2014 ఎన్నికల్లో ఓడినా కేసీఆర్ ఆయ‌న్ను టీఆర్ఎస్‌లోకి తీసుకుని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. అయితే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పార్టీ రెండోసారి బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చినా పాలేరులో ఓడిపోయారు. ఈ క్రమంలో ఇక్కడ నుంచి గెలిచిన కందా ఉపేంద‌ర్‌రెడ్డి కాంగ్రెస్ ను వ‌దిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కేటీఆర్ వర్గంగా…..

ఇక 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించిన పువ్వాడ అజ‌య్ కూడా టీఆర్ఎస్‌లోకి చేరిపోయి.. పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న కేటీఆర్ వ‌ర్గంగా పేరు తెచ్చుకున్నాడు.2014 త‌ర్వాత ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో రాజ‌కీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి ఖ‌మ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేర‌గా ఆయ‌న‌కు తుమ్మల‌ నాగేశ్వరరావుకు రాజ‌కీయంగా ఆధిప‌త్య పోరు న‌డిచింది. ఇక 2018 ఎన్నిక‌ల్లో తుమ్మల ఆధిప‌త్యానికి చెక్ పెట్టాల‌ని సొంత పార్టీలోని ఆయ‌న రాజ‌కీయ ప్రత్యర్థులు అంద‌రూ ఏక‌మై పాలేరులో ఆయ‌న్ను ఓడించార‌న్న టాక్ ఉంది. అప్పటి నుంచి కేసీఆర్ కూడా తుమ్మల‌ నాగేశ్వరరావును ప‌క్కన పెట్టారో లేదా కార‌ణాలు ఏవైనా తుమ్మల హ‌వా త‌గ్గిపోయింది.

సొంత వ్యవసాయ క్షేత్రంలోనే…..

ఇక పువ్వాడ అజ‌య్ మంత్రి అవ్వడంతో ఆయ‌న జిల్లా అంత‌టా త‌న వ‌ర్గాన్ని పెంచు కుంటు న్నారు. తుమ్మల‌ నాగేశ్వరరావుకు ఏ మాత్రం సందు ఇచ్చినా తాను రాజ‌కీయ రేసులో ఎక్కడ వెన‌క‌ప‌డాల్సి వ‌స్తుంద‌నో అజ‌య్ క్రమ‌క్రమంగా కేటీఆర్ స‌పోర్టుతో జిల్లా రాజ‌కీయాల‌ను కంట్రోల్ చేస్తున్నారు. ఒక‌ప‌క్క, తుమ్మల హ‌వా త‌గ్గిపోవ‌డం, మ‌రోప‌క్క, పువ్వాడ దూకుడుతో.. ఉమ్మడి ఖ‌మ్మంలో తుమ్మల నాగేశ్వర‌రావు హ‌వా దాదాపు త‌గ్గిపోయింద‌నే భావ‌న క‌లుగుతోంది. కేటీఆర్ గ్రూపుగా ఉన్న పువ్వాడ అజ‌య్ సైతం తుమ్మల ఉనికి లేకుండా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అదేస‌మ‌యంలో అజ‌య్‌.. పాలేరు ఎమ్మెల్యే కందాళ‌కు వీలున్నప్పుడ‌ల్లా స‌పోర్టు చేస్తున్నార‌ట‌. దీంతో తుమ్మల‌ నాగేశ్వరరావు ఇప్పుడు రాజ‌కీయంగా ఏమీ చేయ‌లేక‌.. త‌న సొంత వ్యవ‌సాయ క్షేత్రంలో ప‌నులు చేసుకుంటున్నారు.

తన వారికి పదవులు ఇప్పించుకుందామనుకున్నా…..

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామం కూడా తుమ్మల‌ నాగేశ్వరరావుకు తీవ్ర మాన‌సిక ఆవేద‌న క‌లిగింది. త‌న వ‌ర్గానికి చెందిన మువ్వా విజ‌య్‌బాబుకు (పాత డీసీసీబీ చైర్మన్‌) డీసీసీబీ చైర్మన్ గిరీ ఇప్పించాల‌ని ప్రయ‌త్నించారు. అయితే, మువ్వాకు కాకుండా అజ‌య్ వ‌ర్గానికి చెందిన కూరాకుల నాగ‌భూష‌ణానికి ఇచ్చారు. బీసీ కోటా కార్డుతో అజ‌య్ తుమ్మల‌కు చెక్ పెట్టేశారు. ఇక అటు పాలేరులో త‌న‌పై గెలిచిన ఎమ్మెల్యే కందాళ ఉపేంద‌ర్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో తుమ్మల ప్రాబ‌ల్యం లేకుండా చేస్తున్నారు. తుమ్మల వ‌ర్గానికి ఏ చిన్న ప‌ద‌వి కూడా లేకుండా చేస్తున్నారు. దీంతో ఇక‌, తుమ్మల నాగేశ్వరరావు పూర్తి డైల‌మాలో ప‌డిపోయారు. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యంపై ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈయ‌న ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News