Ycp : ఇంకోసారి గెలవడం కష్టమేనట
ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు పెద్ద పోరాటమే చేశారు. కానీ రెండుసార్లు గెలుపు సాధ్యం కాలేదు. మూడోసారి మాత్రం గురి తప్పలేదు. అదృష్టం పవన్ కల్యాణ్ రూపంలో వచ్చి [more]
ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు పెద్ద పోరాటమే చేశారు. కానీ రెండుసార్లు గెలుపు సాధ్యం కాలేదు. మూడోసారి మాత్రం గురి తప్పలేదు. అదృష్టం పవన్ కల్యాణ్ రూపంలో వచ్చి [more]
ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు పెద్ద పోరాటమే చేశారు. కానీ రెండుసార్లు గెలుపు సాధ్యం కాలేదు. మూడోసారి మాత్రం గురి తప్పలేదు. అదృష్టం పవన్ కల్యాణ్ రూపంలో వచ్చి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. ఆయనే గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. తిప్పల నాగిరెడ్డి ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
మూడోసారి విజయం ….
తిప్పల నాగిరెడ్డి కార్మికనేతగా ఆ ప్రాంతంలో పట్టు సాధించారు. 2009 లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గాజువాక నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ అయితే 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఓడిపోయిన అతికొద్ది మందికి 2019లో జగన్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో తిప్పల నాగిరెడ్డి ఒకరు. ఈసారి గాజువాకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అదే నాగిరెడ్డికి కలసి వచ్చింది. విజయం సాధించారు.
రెండేళ్లలోనే ఆవిరి….
కానీ గెలిచిన ఉత్సాహం, ఆనందం రెండేళ్లలోనే ఆవిరయిపోయింది. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వచ్చే ఎన్నికల్లో తిప్పల నాగిరెడ్డికి ఇబ్బందిగా మారనుంది. గాజువాక నియోజకవర్గంలో ఎక్కువగా స్టీల్ ప్లాంట్ కార్మికులే ఓటర్లుగా ఉంటారు. వీరంతా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డికి ఇబ్బందిగా మారింది.
పార్టీలోనూ అసంతృప్తి…..
దీనికి తోడు తిప్పల నాగిరెడ్డి తన కుటుంబానికి ఎక్కువ పదవులు ఇప్పించుకున్నారన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. తన కుమారుడు వంశీరెడ్డిని కార్పొరేటర్ గా గెలిపించుకుని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ను చేశారు. మరో కుమారుడు దేవాన్ష్ రెడ్డికి కూడా పార్టీలో పదవులు ఇచ్చారు. ఇటు నియోజకవర్గంలో వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తి ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో నాగిరెడ్డి ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.