టీటీడీ ఆస్తులు నిరర్ధకం ఎలా అయ్యాయి?

టీటీడీకి చెందిన కొన్ని ఆస్తులు నిరర్ధకంగా ఉన్నాయని, వాటిని విక్రయించడమే మేలని ఇప్పుడు తాజా చర్చ నడుస్తోంది. నిరర్ధక ఆస్తుల విక్రయ ప్రతిపాదనను ప్రస్తుత పాలక మండలి, [more]

Update: 2020-05-25 09:30 GMT

టీటీడీకి చెందిన కొన్ని ఆస్తులు నిరర్ధకంగా ఉన్నాయని, వాటిని విక్రయించడమే మేలని ఇప్పుడు తాజా చర్చ నడుస్తోంది. నిరర్ధక ఆస్తుల విక్రయ ప్రతిపాదనను ప్రస్తుత పాలక మండలి, అధికార పార్టీ సమర్ధించుకుంటుండగా, ప్రతిపక్ష వ్యతిరేకిస్తున్నాయి. పైగా 2015లోనే నిరర్ధక ఆస్తుల విక్రయ ప్రతిపాదన వచ్చిందని చెపుతున్నారు.

నాలుగు దశాబ్దాల నుంచి…..

అందునా 1974నుండి టీటీడీ ఆస్తుల విక్రయం జరుగుతూనే ఉందని, ఇది ఇప్పుడు కొత్తగా చేస్తున్న పని కాదని కూడా మరో వాదన వినిపిస్తోంది. అయితే తక్కువ ధరకు తనకు అనుకూలురైన వారికి కట్టబెట్టేందుకే టీటీడీ ఇప్పుడు ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చిందని కూడా ఆరోపణ వచ్చింది.

ఎలా నిరర్థకమయ్యాయి?

ఈ నేపథ్యంలో టీటీడీ జాబితాలో పేర్కొన్న 50 ఆస్తులు ఎలా నిరర్ధకం అయ్యాయి? ఎప్పటి నుండి నిరర్ధకం అయ్యాయి? అవి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాయి? కోర్టు వివాదాల్లో ఉన్నాయా? సదరు ఆస్తుల నిర్వహణకు టీటీడీ చేస్తున్న వార్షిక వ్యయం ఎంత? ఈ అంశాలపై మొదట శ్వేతపత్రం విడుదల చేస్తే, భక్తుల్లో చర్చ జరుగుతుంది. అవి నిరర్ధకమో, కాదో భక్తులే తేల్చుకుంటారు. మనది ప్రజాస్వామ్యం. తాము విరాళంగా ఇచ్చిన ఆస్తులు నిరర్ధకమో, కాదో తేల్చుకునే హక్కు దాతలకు ఉంది. ఆ ప్రయత్నం జరిగితే మంచిది. సముచితం కూడా.

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News