తిరుపతిలో మూడవ ప్లేస్ లో టీడీపీ.. ?
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్లేస్ చెప్పలంటే నిన్నటి దాకా నంబర్ వన్. అంటే అధికారంలో ఉన్న పార్టీ. ఇపుడు నంబర్ టూ. అంటే ప్రతిపక్షం. మళ్ళీ [more]
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్లేస్ చెప్పలంటే నిన్నటి దాకా నంబర్ వన్. అంటే అధికారంలో ఉన్న పార్టీ. ఇపుడు నంబర్ టూ. అంటే ప్రతిపక్షం. మళ్ళీ [more]
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్లేస్ చెప్పలంటే నిన్నటి దాకా నంబర్ వన్. అంటే అధికారంలో ఉన్న పార్టీ. ఇపుడు నంబర్ టూ. అంటే ప్రతిపక్షం. మళ్ళీ జనం కరుణిస్తే నంబర్ వన్ కి ఎగబాకాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. శ్రేణులు చెదిరిపోకుండా బాగానే ధీమా వారిలో పెంచుతున్నారు. కానీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక మాత్రం బాబుకు ఇపుడు యమ టెన్షన్ పెట్టేస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడం సహజం. కానీ రెండవ ప్లేస్ లో కచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండి తీరాలి. ఇది రూల్. లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. అయితే సర్వేలు చూస్తే టీడీపీది మూడవ ప్లేస్ మాత్రమే అని చెబుతున్నాయట.
దూసుకు వచ్చేస్తే…?
ఏపీలో బీజేపీ జనసేన కూటమికి తొలి పరీక్ష కూడా తిరుపతి ఉప ఎన్నికగానే చూడాలి. గత ఏడాది సంక్రాంతి మరునాడు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ ఏడాది కాలంలో పెద్దగా కూటమి జనంలో లేకపోయినా ఇక మీదట ఏపీ పాలిటిక్స్ లో గట్టిగా నిలబడడానికి కావాల్సిన ఆక్సిజన్ తిరుపతి ఉప ఎన్నిక అందిస్తుంది అన్న విశ్వాసంతో రెండు పార్టీల నేతలూ ఉన్నారు. కాపు కార్డుతో పవన్, హిందూ కార్డుతో బీజేపీ తిరుపతిలో దూకుడు చేస్తాయని అంటున్నారు. అదే కనుక జరిగితే ఒక్కసారి గెలిచేంత బలం రాకపోయినా టీడీపీని సులువుగా నెట్టేసే వీలు మాత్రం ఉంది.
ఆశలు కూలడమే….
చంద్రబాబు ఏం జరగకూడదు అనుకున్నారో అదే అపుడు జరుగుతుంది. తన మీద కానీ తన కుమారుడి మీద కానీ నమ్మకం సడలితే ఒక్కసారిగా కట్టలు తెంచుకుని మరీ తమ్ముళ్ళు వేరే పార్టీల వైపు పరుగులు తీస్తారు. ఏపీలో ఇంతకాలం టీడీపీని, దాని నడకను బయట వారి కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే గమనిస్తున్నరు. అందుకే వారు సైలెంట్ గా ఉన్నారు. టీడీపీ బలం పెరిగింది అని బాబు అనడం వరకూ ఓకే. ఇపుడు లిట్మస్ టెస్ట్ లా తిరుపతి ఉప ఎన్నిక వచ్చి పడింది. పైగా అది చంద్రబాబు సొంత జిల్లా. దాంతో అక్కడ టీడీపీ గెలవకపోయినా గట్టిగా నిలబడి ఓట్లు తెచ్చుకోకపోతే పునాదులే కూలడం ఖాయం. రెండవ ప్లేస్ లో టీడీపీ కనుక తిరుపతిలో లేకపోతే మాత్రం తమ్ముళ్ళను ఏ కట్టుబాట్లూ అసలు అపలేవని అంటున్నారు.
ఊపు మాములుగా ఉండదుగా…?
తిరుపతిలో గెలుపు కోసం ఎటూ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ అది కాకపోతే రెండవ ప్లేస్ మాత్రం కచ్చితమైన టార్గెట్. అలా బీజేపీ జనసేన కూటమి రన్నర్స్ గా ఉంటే మాత్రం ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోతాయని అంటున్నారు. చంద్రబాబు ఈ ఏడాది నుంచి జోరు చూపిస్తాను అంటున్నారు. కానీ అంతకు ముందే తమ్ముళ్ళు పరుగులెత్తి బీజేపీ వైపుగా ర్యాలీ అయితే పసుపు శిబిరానికి రాజకీయ విషాదమే అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పెర్ఫార్మెన్స్ ఏంటి అన్నది తిరుపతి ఉప ఎన్నికల్ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. బీజేపీకి అండగా కేంద్రం ఉంది. వైసీపీకి ఏపీలో అధికారం ఉంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని రేసులో నిలబడి సెకండ్ ప్లేస్ అయినా తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం బాబు కిందా మీదా పడాల్సిందే అంటున్నారు.