ముగ్గురూ రెడీనేనట… సై అంటున్నారే?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఎప్పుడైనా జరగొచ్చు. ఆరు నెలల్లో జరగాల్సిన ఎన్నికకు దాదాపు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక [more]

Update: 2020-11-04 13:30 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ఎప్పుడైనా జరగొచ్చు. ఆరు నెలల్లో జరగాల్సిన ఎన్నికకు దాదాపు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగితే పోటీ చేయాలని అన్ని పార్టీలూ దాదాపుగా డిసైడ్ అయ్యాయి. వైసీపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా బల్లిదుర్గాప్రసాదరావు తనయుడు కల్యాణ చక్రవర్తి పేరును దాదాపుగా జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది.

కొడుకుకే టిక్కెట్….

తండ్రి మరణించడంతో తనయుడికే టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయింది. సానుభూతితో పాటు సంప్రదాయంగా కూడా వస్తున్న ప్రకారమే కల్యాణ చక్రవర్తికి వైసీపీ టిక్కెట్ కేటాయించనుంది. ఈ మేరకు జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండటంతో తమ గెలుపు ఖాయమని పూర్తి విశ్వాసంతో ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారని తెలిసింది.

పోటీ చేయాల్సిందేనని…..

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. పదిహేను నెలల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు సయితం సీనియర్ నేతలతో అన్నట్లు సమాచారం. గతంలో పోటీ చేసి ఓటమి పాలయిన పనబాక లక్ష్మి, ఆమె అంగీకరించకపోతే వర్ల రామయ్యను తిరుపతి బరిలో దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. క్యాడర్ నుంచి కూడా పోటీ చేయాల్సిందేనని వత్తిడి వస్తుంది.

తొలిసారి కలిసి పోటీ….

జనసేన, బీజేపీ కూటమి కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ఆసక్తికరంగా ఉంది. పార్లమెంటు ఎన్నిక కావడంతో ఖచ్చితంగా పోటీ చేస్తామని చెబుతున్నారు. జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్న తొలి ఎన్నిక కావడంతో ఆసక్తికరంగా మారనుంది. బీజేపీ నుంచే అభ్యర్థి ఉండే అవకాశముంది. అభ్యర్థి ఎవరన్నదీ ఇంకా నిర్ణయించకపోయినా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గలోని బాధ్యులతో పార్టీ చీఫ్ సోము వీర్రాజు చర్చించినట్లు తెలిసింది. మొత్తం మీద మూడు పార్టీలూ తిరుపతి ఉప ఎన్నికకు రెడీ అయ్యాయి. నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి.

Tags:    

Similar News