తిరుమలకు వెళితే….? వద్దంటున్న టీటీడీ

తిరుమల వెంకన్న దర్శనం ఎప్పుడెప్పుడా అని భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. అంతే ఆతృతగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేసింది. మార్చి లో లాక్ [more]

Update: 2020-07-05 09:30 GMT

తిరుమల వెంకన్న దర్శనం ఎప్పుడెప్పుడా అని భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. అంతే ఆతృతగా తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేసింది. మార్చి లో లాక్ డౌన్ విధించాక తిరిగి లాక్ డౌన్ 6.0 లో మొత్తానికి తిరుమల శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని టిటిడి ఆన్ లైన్ ద్వారా తక్కువ సంఖ్యలోనే భక్తులకు స్వామి దర్శనం ఏర్పాటు చేస్తుంది. అయితే కరోనా దేశవ్యాప్తంగా వీరవిహారం చేస్తున్న దశలో ఇప్పుడు తిరుమల కు వచ్చే భక్తులను కట్టడి చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది టిటిడి.

ఆ జోన్స్ వారు రాకండి …

దేశంలోని రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ పరిధిలో ఉండేవారు తిరుమల రావొద్దని టిటిడి భక్తులకు విజ్నప్తి చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు వస్తే పరీక్షించి వెనక్కి పంపిస్తామని ఆలయ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కలియుగ దైవం వెంకన్నను దర్శించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చేవారు. అయితే లాక్ డౌన్ ప్రభావంతో గోవిందుడి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి తోడు టిటిడి కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసింది.

పెరుగుతున్న భక్తుల తాకిడి …

భౌతిక దూరం పాటించేలా పూర్తి శానిటైజేషన్ ప్రక్రియలు పాటిస్తూ తిరుమలకు వచ్చే వారి విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. ఆన్ లైన్ ద్వారానే దర్శనాలు ఏర్పాటు చేయడం తో వివిధ రాష్ట్రాలనుంచి భక్తుల రాక పెరుగుతూ వస్తుంది. దాంతో మొదట రోజుకు మూడు వేలమంది భక్తులకు దర్శనం ఏర్పాటు చేయాలని భావిస్తే ప్రస్తుతం ఆరువేలమంది వరకు వెంకన్నను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల వచ్చే వారు తాము ఏ జోన్స్ పరిధిలో ఉన్నారో చూసుకుని బయల్దేరితే మంచిది. లేనిపక్షంలో వారికి సుదూరం ప్రయాణించి వెళ్లి నిరాశ గా తిరిగి రావాల్సి ఉంటుంది.

Tags:    

Similar News