తుమ్మల చెప్పినట్లే చేస్తున్నారే?
తుమ్మల నాగేశ్వరరావు…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా [more]
తుమ్మల నాగేశ్వరరావు…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా [more]
తుమ్మల నాగేశ్వరరావు…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావులు స్నేహితులు కావడంతో ఆయన పిలుపు మేరకు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు కేసీఆర్.
మంత్రిగా జిల్లాలో…..
అయితే పాలేరు ఉప ఎన్నిక జరగడంతో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా రాష్ట్ర స్థాయిలో తిరిగి పట్టు సంపాదించుకున్నారు. తెలంగాణలో టీడీపీకి చెందిన బలమైన సామాజిక వర్గం నేత కావడంతో తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ప్రయారిటీ ఇచ్చారు. తిరిగి 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే పాలేరు ప్రజలకు సేవ చేస్తానని, లేకుంటే తనకు ఇష్టమైన వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం విశేషం.
తిరిగి వ్యవసాయ క్షేత్రంలో….
తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో చెప్పినట్లుగానే ఇప్పుడు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. తన సొంత నియోజకవర్గమైన సత్తుపల్లి కి సమీపంలోని గండుగలపల్లిలో వ్యవసాయ క్షేత్రంలోనే తుమ్మల నాగేశ్వరరావు ఎక్కువ సమయం గడుపుతున్నారు. 2018 ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో తనకు తిరిగి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు. అందుకే పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. నామా నాగేశ్వరరావు గెలవడంతో తనకు పదవి ఖాయమనుకున్నారు.
కేసీఆర్ ను కలిసేందుకు కూడా….
కానీ తన సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి ఇవ్వడంతో తుమ్మల నాగేశ్వరరావు ఇక తనను కేసీఆర్ పట్టించుకోరన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కన్పించడం లేదు. హైదరాబాద్ కు రావడం కూడా అరుదేనని చెబుతున్నారు. హైదరాబాద్ వచ్చినా కేసీఆర్ ను కలిసేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నించడం లేదు. ఆయన పూర్తిగా తన సొంత గ్రామమైన గండుగులపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటానన్న తుమ్మల ఆ మాటకే పరిమితమయ్యారు.