తుమ్మల ఇక ఆ ఎన్నికలకు దూరమట

సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు మంచి రోజులు వస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఆయన కుమారుడే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తుమ్మల యుగంధర్ తాను ప్రత్యక్ష [more]

Update: 2021-08-31 11:00 GMT

సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు మంచి రోజులు వస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు. ఆయన కుమారుడే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తుమ్మల యుగంధర్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అదే సమయంలో తన తండ్రి తుమ్మల నాగేశ్వరరావుకు త్వరలో మంచిరోజులు రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి తుమ్మల నాగేశ్వరరావు ఇక ప్రత్యక్స ఎన్నికలకు దూరం కానున్నారని తెలిసింది.

కీలక నేతగా ….

తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలపాత్ర పోషించారు. అనేకసార్లు మంత్రిపదవులను అధిష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. చేరిన వెంటనే ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు కు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఆ తర్వాత పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

ఓటమి తర్వాత…

అయితే తుమ్మల నాగేశ్వరరావు 2018 లో ఓటమి పాలయిన తర్వాత రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. అప్పడప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పెద్దగా క్రియాశీలకంగా లేరనే చెప్పాలి. ఆయన ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ తనకు మంచి మిత్రుడు కావడంతో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తుమ్మల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇంతవరకూ తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావన రాలేదు.

త్వరలోనే దక్కుతుందట…

కానీ త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందంటున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు యుగంధర్ పరోక్షంగా చెప్పారు. తన తండ్రికి మంచి రోజులు వస్తున్నాయన్నారు. కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని ఆయన చెప్పడంతో తుమ్మల అనుచరుల్లో ఆనందం పెల్లుబుకుతోంది. మరోవైపు యుగంధర్ మాటలను బట్టి తుమ్మల నాగేశ్వరరావు ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయినట్లే.

Tags:    

Similar News