అంతా ఆయనదేనట.. ఆయన చుట్టూనే…?
సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు వారసులకు తాము ఉండగానే బాధ్యతలను కట్టబెట్టాలని చూస్తారు. కానీ తమిళనాడులో స్టాలిన్ విషయంలో అది జరగలేదు. కరుణానిధి నేతృత్వంలో అనేక సార్లు [more]
సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు వారసులకు తాము ఉండగానే బాధ్యతలను కట్టబెట్టాలని చూస్తారు. కానీ తమిళనాడులో స్టాలిన్ విషయంలో అది జరగలేదు. కరుణానిధి నేతృత్వంలో అనేక సార్లు [more]
సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు వారసులకు తాము ఉండగానే బాధ్యతలను కట్టబెట్టాలని చూస్తారు. కానీ తమిళనాడులో స్టాలిన్ విషయంలో అది జరగలేదు. కరుణానిధి నేతృత్వంలో అనేక సార్లు పార్టీ అధికారంలోకి వచ్చినా స్టాలిన్ మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు. కరుణానిధి చివర వరకూ ముఖ్యమంత్రి కుర్చీ మీద మమకారాన్ని వదులుకోలేేకపోవడమే. కరుణానిధి జీవించి ఉండగా ఆయన కంటే స్టాలిన్ ను కలిసేందుకే ఎక్కవ మంది పోటీ పడేవారు. అప్పడు స్టాలిన్ కు సన్నిహితంగా ఉన్నవారే నేడు పార్టీలో కీలకంగా మారారు.
గతంలోనూ స్టాలిన్ చుట్టూ…..
కరుణానిధి సయమంలో చక్రం తిప్పిన వారు ఇప్పుడు దాదాపు పక్కన ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ కు కూడా ఒక రకంగా ఇదే సమస్య ఎదురయింది. తన కుమారుడు ఉదయనిధి పెత్తనం పార్టీలో ఎక్కువవుతుంది. స్టాలిన్ ను కలిసే కంటే ఉదయనిధిని కలిస్తే పనిఅయిపోతుందన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఉదయనిధి సినీ హీరో కూడా కావడంతో ఆయన పార్టీకి ప్లస్ గానే చెప్పుకోవాలి. అందుకే ఉదయనిధిని స్టాలిన్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా చేశారు.
ఉదయనిధి వద్దకు క్యూ….
అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో అనేక మంది నేతలు ఉదయనిధి దగ్గరకు క్యూ కడుతున్నారు. పార్టీలో సీనియర్లను పట్టించుకోకుండా ఉదయనిధి తనకు నమ్మకమైన వారిని చేరదీస్తున్నారు. వారికే టిక్కెట్లు అని చెబుతుండటంతో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు సీనియర్ నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ ప్రశాంత్ కిషోర్ టీం సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేసినట్లు సమాచారం.
విభేదాలు ఇప్పటివి కావు….
గతంలోనూ సీనియర్ నేతలకు, ఉదయనిధికి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. గతంలో జరిగిన నాంగునేరి, విక్రంవాడి ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఉదయనిధి కారణమని సీనియర్లు, సీనియర్లే కారణమని ఉదయనిధి పరస్పరం ఆరోపించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఉదయనిధి సీనియర్ నేతలంటేనే మండిపడుతున్నారు. ఎక్కువమందికి టిక్కెట్లు ఇప్పించుకుని తన టీం ఉండేలా చూసుకోవాలని ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని డీఎంకేలో చర్చ జరుగుతుంది. ఉదయనిధికి చెక్ పెట్టాల్సింది స్టాలిన్ మాత్రమే కావడంతో ఆయనవైపే అందరూ చూస్తున్నారు.