ఉద్ధవ్ ఊపిరి పీల్చుకుంటున్నారు… కారణం ఏంటంటే?
మధ్యప్రదేశ్ పరిణామాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కొంత కుదుటపడ్డారు. మహారాష్ట్రలోనూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లు [more]
మధ్యప్రదేశ్ పరిణామాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కొంత కుదుటపడ్డారు. మహారాష్ట్రలోనూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లు [more]
మధ్యప్రదేశ్ పరిణామాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కొంత కుదుటపడ్డారు. మహారాష్ట్రలోనూ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లు కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఒత్తిడుల మధ్య ఉద్ధవ్ థాక్రే పాలనను లాగించుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీల డిమాండ్లకు ఉద్ధవ్ థాక్రే తలొగ్గక తప్పడం లేదు.
మధ్యప్రదేశ్ పరిణామాలతో….
అయితే మధ్యప్రదేశ్ పరిణామాలతో కాంగ్రెస్, ఎన్సీపీలు వెనక్కు తగ్గే అవకాశముంది. భారతీయ జనతా పార్టీ తర్వాత లక్ష్యం మహారాష్ట్ర కావడంతో కాంగ్రెస్, ఎన్సీపీలు అప్రమత్తమయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేను కట్టడి చేసుకునే పనిలో పడ్డాయి. ఎలాంటి అసంతృప్తులు లేకుండా చూసుకోవడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ టార్గెట్ ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కావడంతో వారు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
కట్టడి చేయాలని…..
నిన్నటి వరకూ కాంగ్రెస్, ఎన్సీపీలు ఉద్ధవ్ థాక్రేను కట్టడి చేయాలని చూశాయి. ప్రధానంగా పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, విద్యాసంస్థల్లో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరిని అనుసరించాలని ఉద్దవ్ థాక్రేను కోరుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సయితం ఉద్ధవ్ థాక్రే నిర్ణయాలను పలు సమావేశాల్లో తప్పుపట్టారు కూడా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి ఉద్దవ్ థాక్రే నిర్ణయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి.
వెనక్కు తగ్గి….ఎమ్మెల్యేలపై….
కానీ మధ్యప్రదేశ్ పరిణామాల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలు కొంత వెనక్కు తగ్గినట్లే కన్పిస్తుంది. అతి పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రను చేజార్చుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ఇది ఒకరకంగా ఉద్ధవ్ థాక్రేకు మేలు చేకూర్చే అంశమే. శివసేన నుంచి బీజేపీ లోకి ఎమ్మెల్యేలు వెళ్లడం కష్టమే. కాంగ్రెస్, ఎన్సీపీల్లో మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చే పనిలోనే ఉన్నాయి. ఇది ఒకరకంగా ఉద్ధవ్ థాక్రే కు ఊరట కల్గించే అంశమేనంటున్నారు విశ్లేషకులు.