తేడా కొట్టినట్లేగా?

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రణాళికను ఉద్ధవ్ థాక్రే పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు మిత్రపక్షాల నుంచి విన్పిస్తున్నాయి. బలం లేకపోయినా [more]

Update: 2020-02-17 17:30 GMT

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రణాళికను ఉద్ధవ్ థాక్రే పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు మిత్రపక్షాల నుంచి విన్పిస్తున్నాయి. బలం లేకపోయినా మిత్రుల సహకారంతో ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన ఉద్ధవ్ థాక్రే ఏకపక్ష వైఖరిని కూటమి నుంచే విమర్శలు వినపడుతున్నాయి. దీంతో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ చీలిపోతుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

సీఏఏ, ఎన్పీఆర్ లు….

పౌరసత్వ చట్టం, ఎన్సార్సీ, ఎన్పీఆర్ లను కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేస్తున్నాయి. కానీ మహారాష్ట్రలో మాత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే మిత్రుల నిరసనలను పట్టించుకోవడం లేదు. సీఏఏ, ఎన్పీఆర్ లను అమలు చేయడానికే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. మే 1 నుంచి ఎన్పీఆర్ ను నిర్వహించాలని ఉద్ధవ్ థాక్రే కలెక్టర్లను ఆదేశించడంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఓటు బ్యాంకు కోసం…..

కాంగ్రెస్, ఎన్సీపీలు ముస్లిం ఓటు బ్యాంకు తమ నుంచి చేజారి పోకుండా సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో తమకు ప్రధాన ఓటు బ్యాంకు అయిన హిందువులను పోగొట్టుకునేందుకు కూడా ఉద్ధవ్ థాక్రే వెనుకాడరు. ఎన్సీపీ, కాంగ్రెస్ చేతిలో శివసేన పావుగా మారిందన్న సంకేతాలు వెళితే అసలుకే ఎసరు వస్తుందని, బీజేపీ మరింత బలపడే ప్రమాదముందని ఉద్ధవ్ థాక్రేకు తెలియంది కాదు. అందుకే సీఏఏ, ఎన్పీఆర్ లను మహారాష్ట్రలో అమలు చేయడానికే ఉద్ధవ్ థాక్రే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది. దీనిని కాంగ్రెస్, ఎన్సీపీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

భీమా కోరెగావ్ కేసు కూడా….

దీంతో పాటు భీమా కోరెగావ్ కేసు కూడా కూటమిలో చిచ్చుపెట్టిందనే చెప్పాలి. భీమా కోరెగావ్ కేసును ఎన్ఐఏకు అప్పగించడంలో తమకు అభ్యంతరం లేదని ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పుపడుతున్నారు. భీమా కోరెగావ్ కేసులో విచారణ చేస్తున్న పూనే కోర్టు ఈకేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉద్ధవ్ థాక్రే తీసుకున్న నిర్ణయం వివాదానికి కారణమయింది. దీంతో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తే అవకాశముందని విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News