శివసేనకు అదే మంచిదట

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు వేడిగానే ఉంటాయి. అక్కడ ఉన్న సంకీర్ణ సర్కార్ ను కూల్చివేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉంది. అయితే వీటన్నింటిని అధిగమించి ఉద్ధవ్ [more]

Update: 2020-11-30 18:29 GMT

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పటికప్పుడు వేడిగానే ఉంటాయి. అక్కడ ఉన్న సంకీర్ణ సర్కార్ ను కూల్చివేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూనే ఉంది. అయితే వీటన్నింటిని అధిగమించి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. మహారాష్ఱ్రలో మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమన్వయంతో ఉద్ధవ్ థాక్రే మిత్రపక్షాలను తీసుకెళుతున్నారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను ఏమాత్రం నొప్పించకుండా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

హెచ్చరికలు జారీ చేస్తున్నా…..

మరోవైపు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వల వేస్తుంది. ఎన్సీపీ, శివసేన ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడం సాధ్యం కాకపోవడంతో కాంగ్రెస్ పైనే బీజేపీ కన్నేసింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అవసరాలను కూడా ఎప్పటికిప్పుడు తీర్చేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు తనను నేరుగా కలవలేకపోయినా వారి సమస్యలను పరిష్కరించేందుకు సపరేట్ సెల్ ను ఏర్పాటు చేశారు.

మరో అవకాశం…..?

ఇప్పుడు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో అవకాశమొచ్చింది. త్వరలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే ఈ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. బీజేపీ ముంబయి కార్పొరేషన్ పై జెండా ఎగురేయాలని ఇప్పటికే పనిని ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో దెబ్బతీసి శివసేనను మానసికంగా దెబ్బతీయాలన్న వ్యూహంతో బీజేపీ ఉంది. అందుకే మహారాష‌్ట్ర నవ నిర్మాణ సేనతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది.

ఎన్సీపీతో కలసి…..

దీంతో శివసేన కూడా బృహన్ ముంబై కార్పొరేషన్ ను ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోకూడదని నిర్ణయించారు. ముంబయి కార్పొరేషన్ చేజారితే సగం శివసేన బలం పోయినట్లే. అందుకే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఈ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్సీపీ తనకు అండగా ఉంటే ముఖ్యమంత్రి పదవికి కూడా ఢోకా ఉండదని శివసేన అంచనా వేస్తుంది. అందుకే కాంగ్రెస్ కలసి రాకపోయినా ఎన్సీపీతో ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తుందంటున్నారు.

Tags:    

Similar News