కుమారస్వామిని అడుగు.. కష్టాలు చెబుతాడు
సంకీర్ణ సర్కార్ ను నడపటమంటే మాటలు కాదు. అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. ఎవరినీ నొప్పించకుండా పనిచేసుకు పోవాల్సి ఉంటుంది. సంకీర్ణ సర్కార్ నడపటం ఎంత కష్టమో [more]
సంకీర్ణ సర్కార్ ను నడపటమంటే మాటలు కాదు. అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. ఎవరినీ నొప్పించకుండా పనిచేసుకు పోవాల్సి ఉంటుంది. సంకీర్ణ సర్కార్ నడపటం ఎంత కష్టమో [more]
సంకీర్ణ సర్కార్ ను నడపటమంటే మాటలు కాదు. అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. ఎవరినీ నొప్పించకుండా పనిచేసుకు పోవాల్సి ఉంటుంది. సంకీర్ణ సర్కార్ నడపటం ఎంత కష్టమో ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని అడిగి తెలుసుకుంటే మంచిది. ఇటు సొంత పార్టీ అజెండా, మరోవైపు కూటమిలోని పార్టీల గొంతెమ్మ కోర్కెలు వెరసి రాజకీయ సన్యాసం తీసుకుందామన్న రేంజ్ కు తీసుకెళతాయి. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అనూహ్య పరిస్థితుల్లో…..
నిజానికి అనూహ్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన ఉద్ధవ్ థాక్రే నెమ్మదిగా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం ఉద్ధవ్ ను కట్టడి చేసేందుకే ప్రయత్నిస్తున్నాయి. ప్రతి నిర్ణయమూ తమకు చెప్పే తీసుకోవా లంటు న్నాయి. సంకీర్ణ సర్కార్ మనుగడ పూర్తి కాలం కొనసాగాలంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాలని కుండబద్దలు కొడుతున్నాయి.
కట్టడి చేయాలని….
కూటమి ఏర్పాటుకు ముందే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాయి. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కాంగ్రెస్, ఎన్సీపీ గట్టిగా కోరుతున్నాయి. దానికే ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నాయి. అయితే ఉద్ధవ్ థాక్రే మాత్రం సీఏఏ, ఎన్సార్సీ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలకు తలొగ్గేలా లేరు. ఇది ప్రమాదకరం కాదని చెబుతున్నారు. ఎవరికీ ఇబ్బంది ఉండదంటున్నారు. ఈ విషయంలో కూటమిలోని పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనే చెప్పాలి.
ముస్లిం రిజర్వేషన్లు…..
మరోవైపు ముస్లిం రిజర్వేషన్లు కూడా ఉద్ధవ్ థాక్రేకు చికాకును తెప్పిస్తున్నాయి. మహారాష్ట్రలోని అన్ని విద్యాసంస్థల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్, ఎన్సీపీలు గట్టిగా కోరుతున్నాయి. పట్టుబడుతున్నాయి కూడా. అయితే దీనిపై శివసేన సుముఖంగా లేదు. అదే చేస్తే తమను గెలిపిస్తూ వస్తున్న హిందూ ఓటు బ్యాంకు కు గండిపడే అవకాశముందన్న ఆందోళన ఉద్ధవ్ థాక్రేలో ఉంది. అందుకే ఈ విషయంలో ఉద్ధవ్ నాన్చడానికే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు ససేమిరా అంటున్నాయి. మరి ఈ అంశం నుంచి ఉద్ధవ్ థాక్రే ఎలా బయటపడతారో చూడాలి.