ప్రమాదం ముంచుకొస్తుంది అంటున్న ఉండవల్లి
కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలిసింది చేసేశాయి. ఇక చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది. రాబోయే ప్రమాదంపై మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం ఆందోళనకరం. దేశం కరోనా [more]
కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలిసింది చేసేశాయి. ఇక చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది. రాబోయే ప్రమాదంపై మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం ఆందోళనకరం. దేశం కరోనా [more]
కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలిసింది చేసేశాయి. ఇక చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది. రాబోయే ప్రమాదంపై మాత్రం ప్రభుత్వాలు ఆలోచన చేయకపోవడం ఆందోళనకరం. దేశం కరోనా తరువాత తీవ్ర సంక్షోభాన్ని అధిగమించాలిసి ఉంటుంది. దీనిపై నిపుణులతో ఇప్పటినుంచి కార్యాచరణ చేపట్టాలిసిఉంది. అయితే దురదృష్టవశాత్తు అలాంటి కార్యక్రమాలు ఏవీ ప్రభుత్వాలు చేయడం లేదు. అంటూ ఇటీవల కరోనా సోకి కోలుకున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చేది ఇదే …
దేశంలో గత ఆరునెలలకు పైగా పనులు లేవు. సామాన్యులు ఉపాధి కోల్పోయారు. వారు తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు వెయ్యి రెండువేల రూపాయలు అడపా దడపా ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం ఏమి లేదు. కుటుంబాలకు కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయి రోడ్డున పడిపోయాయి. దేశం అభివృద్ధి చెందుతున్నది కావడం వల్ల ఈ పరిణామాలు చాలా ప్రమాదకర స్థితిని సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాలకు పోయేదేమీ లేదు. మనదేశంలో మాత్రం ఉద్యోగాలు పోయి చేసేందుకు పనులు లేక దోపిడీలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది.
డబ్బున్నవారినుంచి …
ఎందుకంటే ఒక పక్క కోటీశ్వరులు మరోపక్క పేదలు నివసించే దేశం మనది. ఈ అసమానతలు ఆకలి, ఎలాంటి పరిస్థితి ని అయినా సృస్ట్టించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రాబోయే ఉపద్రవానికి విరుగుడు కనిపెట్టకపోతే దేశానికి ప్రమాదం అంటున్నారు ఉండవల్లి. దేశంలో ధనవంతుల సొమ్ము బ్యాంక్ ల్లో డిపాజిట్ చేసి వారికి ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వడం, అలాగే పేదలకు రుణ సహకారం అందించి ఆదుకోవడం వంటి చర్యలను ఆయన సూచించారు.
ప్రయివేట్ దోపిడీ ని ఎందుకు అరికట్టారు …?
కరోనా చికిత్స పేరుతో లక్షల రూపాయల్లో ప్రయివేట్ ఆసుపత్రులు దోపిడీ యథేచ్ఛగా సాగిస్తున్నా ప్రభుత్వాల మౌనం వహించడం దారుణమని ఉండవల్లి విమర్శించారు. కరోనా వచ్చి పోయే వారికన్నా ఆసుపత్రికి వెళ్లి ఆర్ధికంగా చితికిపోయి చనిపోవాలిసిన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపి. తక్షణం ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా స్ట్రైన్ లు విచిత్రంగా ఉన్నాయని అమితాబ్ కి సోకినప్పుడు అయిపోయారని అంతా అనుకున్నారని కానీ ఆయన విజేతగా బయటపడ్డారని ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం అలాగే బయటపడతారనుకుంటే చనిపోయారని అన్నారు ఉండవల్లి. కరోనాకు భయపడకూడదని అలాగే నిర్లక్ష్యం వహించకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అరుణ కుమార్.