వైఎస్ కుటుంబాన్ని అంటే ఉండవల్లి ఊరుకుంటారా…?
వైఎస్సార్ మేధో మధన టీంలో అతి కీలకమైన సభ్యుడుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి పేరుంది. ఆయన వైఎస్సార్ హయాంలో రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో [more]
వైఎస్సార్ మేధో మధన టీంలో అతి కీలకమైన సభ్యుడుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి పేరుంది. ఆయన వైఎస్సార్ హయాంలో రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో [more]
వైఎస్సార్ మేధో మధన టీంలో అతి కీలకమైన సభ్యుడుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి పేరుంది. ఆయన వైఎస్సార్ హయాంలో రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆనాడు ఉండవల్లి మీడియా మీటింగ్ లేని రోజు ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. లాజిక్ తీసి మరీ విపక్షాల మీద విమర్శలు చేయడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ దిట్ట. అటువంటి ఉండవల్లికి వైఎస్సార్ మరణాంతరం గడ్డు రోజులు ప్రాప్తించాయి. ఆ తరువాత కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంతో ఆయన పూర్తిగా రాజకీయాలకే స్వస్తి చెప్పారు.
రాయి ఎవరేసుకుంటారు..?
నిజానికి ఇది చంద్రబాబుకు కూడా తెలుసు. రాజకీయనాయులకు ఒక మతం కులం ఉండదు, వారికి అన్నీ ఓటు రూపంలోనే కనిపిస్తాయి. బాగా తలపండిన చంద్రబాబుకు ఇది అర్ధం కాదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. కానీ ఆయన కావాలని జగన్ సర్కార్ మీద బాణాలు వేస్తున్నారు. జగన్ ని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించి బదనాం చేయాలనుకుంటున్నారు. దానికి ధీటైన సమాధానం తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా మత దాడులను ప్రోత్సహించదు అని ఆయన కచ్చితంగా చెప్పేశారు. అందువల్ల అది రాజకీయ ప్రమేయంలేని దాడులు గానే వీటిని చూడాలని, మత రాజకీయాలకు కూడా ఏపీలో తావు ఇవ్వరాదని కూడా ఉండవల్లి అంటున్నారు.
గౌరవించేవారే సుమా…?
వైఎస్ కుటుంబానికి అతి సన్నిహితంగా మెలిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు అంటే జనాలు పూర్తిగా నమ్ముతారు. ఉండవల్లి వైఎస్సార్ కుటుంబం గురించి మాట్లాడుతూ చాలా పెద్ద సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఏపీలో జగన్ సహా వైఎస్సార్ కుటుంబ సభ్యులు హిందూ సంప్రదాయాలను పూర్తిగా గౌరవిస్తారు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. అంతే కాదు జగన్ తాత హయాంలో వారంతా క్రిస్టియన్ మతంలోకి వెళ్లినా కూడా మిగిలిన వారి ఇళ్ళలో ఇప్పటికీ హిందూ మతం ప్రకారమే పూజలు చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు లేని ఫ్యామిలీ అంటూ పూర్తిగా మద్దతు ఇస్తూ మాట్లాడారు.
కరడు కట్టిన హిందువే ….
ఇక జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తనకంటే పెద్ద భక్తుడు అని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అనడం ఆసక్తిని కలిగించే పరిణామమే. తాము బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారిమైనా కూడా తమ ఇళ్లలో కంటే కూడా నిష్టగా నియమాలతో సుబ్బారెడ్డి ఇంట్లో పూజలు జరుగుతాయని కూడా ఆయన చెప్పడం గమనించాల్సిందే. ఏది ఏమైనా ఏపీలో మత రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ని టార్గెట్ చేయడానికి ఏకమొత్తంగా అన్ని పార్టీలు కలసి కృషి చేస్తున్నాయి. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారనుకోవాలి. మరి దీని ఎఫెక్ట్ జనాల మీద ఎంత వరకూ ఉంటుంది అన్నది చూడాలి.