మే నుంచి మళ్లీ మోదీ మోత మోగిస్తారట
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య, సామాన్య తరగతి ప్రజలను పట్టించుకోవడం లేదు. అయితే ఎన్నికలు వస్తే మాత్రం కొంత సానుకూల నిర్ణయాలు [more]
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య, సామాన్య తరగతి ప్రజలను పట్టించుకోవడం లేదు. అయితే ఎన్నికలు వస్తే మాత్రం కొంత సానుకూల నిర్ణయాలు [more]
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య, సామాన్య తరగతి ప్రజలను పట్టించుకోవడం లేదు. అయితే ఎన్నికలు వస్తే మాత్రం కొంత సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, అనంతరం మామూలు పరిస్థితికి రావడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. మొన్నటి వరకూ పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెరుగుదల మామూలుగా లేదు. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి.
నోటిఫికేషన్ విడుదల తర్వాత….
ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఈ తగ్గుదల కన్పిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పెట్రో ఉత్పత్తుల పెరుగుదల ప్రభావం ఉంటుందని కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికతతో మోదీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆయిల్ కంపెనీలతో చర్చించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ధరల పెరుగుదల లేకుండా చూడాలని మోదీ ప్రభుత్వం కోరడంతో కొన్నాళ్లుగా ధరలు దిగుతూ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో …..
నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా పెరుగుతండటంతో మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువయింది. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించడం, అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారంటూ సోషల్ మీడియాలో అత్యధిక మంది యువకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారం వరకూ మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకునే వీలులేదు.
ధరలు తగ్గుతాయంటూ……
అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మాత్రం మరోసారి మోత మోగిపోతుందంటున్నారు. ఫలితాలు ఎలా వచ్చినా మోదీ తాను అనకున్నదే చేస్తారు. అందుకోసం ఏప్రిల్ చివరి వరకూ ఆగాలని మోదీ భావిస్తున్నారు. మే నుంచి మోదీ నిర్ణయాలు అమలవుతాయని చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. ఈ విషయమే సోషల్ మీడియాలో మోదీ ని డ్యామేజ్ చేస్తూ కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. నష్ట నివారణ కోసం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రంగంలోకి దిగారు. భవిష్యత్ లో పెట్రోలు ధరలు దిగివస్తాయని ఆయన చెప్పడం ఇందులో భాగమేనంటున్నారు. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరోసారి మోదీ మోత మోగిస్తారంటున్నారు.