వంగవీటిని అందరూ లైట్ తీసుకుంటుంది ఎందుకో?

వంగవీటి రాధాను ఏ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమేంటి? ఆయన ఏపార్టీలో ఉన్నా యాక్టివ్ గా ఉండకపోవడమేనా? బలం లేకపోవడమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగా [more]

Update: 2020-10-13 15:30 GMT

వంగవీటి రాధాను ఏ పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమేంటి? ఆయన ఏపార్టీలో ఉన్నా యాక్టివ్ గా ఉండకపోవడమేనా? బలం లేకపోవడమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగా తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా రాజకీయంగా అట్టర్ ప్లాప్ అయ్యారు. నిజానికి తండ్రి ఇమేజ్ ను ఉపయోగించుకుని ఏపీ లాంటి రాష్ట్రంలో ఆయన ఉన్నతస్థాయికి ఎదగాల్సి ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత…..

రాష్ట్ర విభజన తర్వాత రాధా రాజకీయం మరింత మెరుగుపడాల్సి ఉండగా రోజురోజుకూ దిగజారిపోతుంది. దీనికి ప్రధాన కారణం వంగవీటి రాధా పార్ట్ టైైం పాలిటిక్స్ చేస్తారని పేరు. ఆయన ఎక్కువగా ప్రజల్లో కలసి ఉండటానికి ఇష్టపడరు. తాజాగా కృష్ణానదికి వరదపోటెత్తి విజయవాడ నగరంలోని కృష్ణలంక, భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర్ నగర్ వంటి మునిగిపోయి నిరాశ్రయులైనా పలకరించేందుకు రాలేదు.

వైసీపీ నుంచి…..

గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఏదో ఒక పదవి ఉండేది. కానీ వైసీపీని వదిలేసి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడంతో వంగవీటి రాధా గత పదిహేను నెలలుగా మౌనంగానే ఉంటున్నారు. జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా ఆ దిశగా అడుగులు వేయలేదు. తన తండ్రి రంగా జయంతి, వర్థంతి కార్యక్రమాలకు తప్ప రాధా బయటకు రారనేది విజయవాడలో ఆయనపై విన్పిస్తున్న టాక్.

టీడీపీ కూడా…..

తాజాగా చంద్రబాబు నియమించిన కమిటీల్లో కూడా వంగవీటి రాధాకు ప్రాధాన్యం దక్కలేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ బందరు పార్లమెంటు టిక్కెట్ ను ఆఫర్ చేసింది. అయినా వంగవీటి రాధా టీడీపీలోకే వెళ్లారు. టీడీపీ కూడా గత ఎన్నికల్లో ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు. అనకాపల్లి పార్లమెంటు కు పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా పదవుల భర్తీలో వంగవీటి రాధాకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంపై ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతుంది. వంగవీటి రాధా ఏపార్టీలో ఉన్నా ఆ పార్టీ హైకమాండ్ లైట్ గా తీసుకుంటుందన్నది వాస్తవం.

Tags:    

Similar News