తెలుగు మహిళ ఫుల్ సైలెంట్ ?

ఆమె రాజకీయాల్లోకి లేట్ గా వచ్చినా స్పీడ్ గానే ఎదిగింది. అంతే కాదు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా ఉండడంతో ఆ అనుభవం [more]

Update: 2021-04-10 05:00 GMT

ఆమె రాజకీయాల్లోకి లేట్ గా వచ్చినా స్పీడ్ గానే ఎదిగింది. అంతే కాదు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా ఉండడంతో ఆ అనుభవం బాగా అక్కరకు వచ్చింది. ఏ అంశం మీదనైనా చక్కగా ధాటీగా మాట్లాడే నేర్పు ఆమె సొంతం. ఆమె ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఆమె ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. కారణాలు తెలియడంలేదు కానీ ఆమె పార్టీ యాక్టివిటీస్ కి దూరంగానే ఉంటున్నారని టాక్.

గ్యాప్ అలా ….?

ప్రతిష్టాత్మకమైన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల వేళ కూడా వంగలపూడి అనిత ఎక్కడా కనిపించలేదు. ఆమెను పార్టీ పెద్దలు సరిగ్గా పట్టించుకోలేదని గుస్సా అయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. పైగా పొలిట్ బ్యూరో మెంబర్. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. అటువంటి వంగలపూడి అనిత పార్టీకి అవసరం అని చంద్రబాబు ప్రోత్సహించారు కానీ ఇతర నాయకుల వ్యవహార శైలి వల్లనే ఆమె గప్ చిప్ అయ్యారని తెలుస్తోంది.

అనుమానమేనా…?

అనిత టీడీపీకి ఇపుడు బలమైన గొంతుకగా ఉన్నారు. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది పెద్ద నాయకులు సైలెంట్ అయినా కూడా వంగలపూడి అనిత దూసుకుపోతూ వచ్చారు ఎక్కడా జగన్ సర్కార్ ని స్పేర్ చేయకుండా ధాటీగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అటువంటి అనిత ఇపుడు డల్ కావడం పట్ల ఆమె అనుచరులతో పాటు పార్టీలోనూ చర్చ సాగుతోంది. పార్టీకి వరస ఓటములు కూడా ఆమె జోరుకు బ్రేక్ వేశాయా అన్న చర్చ కూడా ఉంది. ఇక ఆమె వేరే ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది.

మైనస్సే ….?

వంగలపూడి అనిత లాంటి మహిళా నేత మూగ నోము పట్టడం టీడీపీకి మైనస్ గానే చెబుతున్నారు. పైగా విపక్షంలో ఉన్న వేళ నోరున్న నేతలు చాలా అవసరం. ఆ లోటుని భర్తీ చేస్తూ తొలినాళ్ళలో లౌడ్ వాయిస్ తో రచ్చ చేసిన వంగలపూడి అనిత ఒక దశలో జగన్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ సాగారు. విశాఖ జిల్లా నర్శీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐ దాకా వెళ్ళడానికి అనిత చేసిన పోరాటం ఆమె పెట్టిన ఎఫర్ట్స్ ప్రధాన కారణాలుగా చెబుతారు మరి అంతటి జోరుకు ఇపుడు సడెన్ గా ఎందుకు బ్రేకులు పడ్డాయన్నది ఆలోచించాల్సిన విషయమే. నాయకులదే తప్పు అయితే చంద్రబాబు జోక్యం చేసుకుని సరిదిద్దాలి. ఒకవేళ ఆమె వేరే రకాలైన ఆలోచనల్లో ఉంటే మాత్రం విశాఖ టీడీపీకి దెబ్బే అని కచ్చితంగా చెప్పాల్సిందే.

Tags:    

Similar News