అసలు జనాలే పట్టించుకోవడం లేదా?
వంగవీటి రాధా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఏమాత్రం కన్పించలేదు. రాను రాను బెజవాడ రాజకీయాలకు వంగవీటి రాధా దూరమయిపోతున్నారనే అనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల [more]
వంగవీటి రాధా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఏమాత్రం కన్పించలేదు. రాను రాను బెజవాడ రాజకీయాలకు వంగవీటి రాధా దూరమయిపోతున్నారనే అనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల [more]
వంగవీటి రాధా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం ఏమాత్రం కన్పించలేదు. రాను రాను బెజవాడ రాజకీయాలకు వంగవీటి రాధా దూరమయిపోతున్నారనే అనిపిస్తుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం మరోసారి రుజువయింది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పట్టుంది. అది ఒక్కప్పుడు. కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం, రంగా అభిమానులు అధిక సంఖ్యలో ఉండటంతో సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధాకు గ్రిప్ ఉంది.
ఒక్కసారి ఎమ్మెల్యే అయి….
వంగవీటి రాధా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే. ఆ తర్వాత వంగవీటి రాధా వేసిన రాంగ్ స్టెప్పులు ఆయన రాజకీయ జీవితాన్ని మార్చి వేశాయి. వరసగా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన రాధా అక్కడ నిలకడగా ఉండలేకపోయారు. వైసీపీ లో ఉన్నప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
పార్టీలు మారుతూ….
2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా వంగవీటి రాధా అంగీకరంచలేదు. ఆయనకు మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్టానం ముందుకు వచ్చింది. అయితే తనకు సెంట్రల్ నియోజకవర్గం దక్కదని, మల్లాది విష్ణు ను వైసీపీలోకి చేర్చుకోవడంతో వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీలోనూ వంగవీటి రాధాకు టిక్కెట్ దక్కలేదు. ప్రస్తుతం టీడీపీలోనే వంగవీటి రాధా కొనసాగుతున్నారు.
పట్టున్న ప్రాంతంలోనే…..
అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వంగవీటి రాధా తన మద్దతు దారుల తరుపున ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా జనసేన అభ్యర్థులకు కూడా మద్దతు పలికారు. అయినా సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా ప్రభావం కన్పించలేదు. దీంతో వంగవీటి అభిమానుల్లో ఆందోళన మొదలయింది. సెంట్రల్ నియోజకవర్గంలో క్రమంగా వంగవీటి పట్టు కోల్పోతున్నారన్నది వాస్తవం. మరి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుందో చూడాలి మరి.