మళ్లీ మారినా టిక్కెట్ రాదట
వంగవీటి రాధా ఉన్న కొద్దిపాటి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అందరికీ తానే అవకాశాలు కల్పిస్తున్నారు. చివరకు తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా చేసుకున్నారు. వంగవీటి రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న [more]
వంగవీటి రాధా ఉన్న కొద్దిపాటి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అందరికీ తానే అవకాశాలు కల్పిస్తున్నారు. చివరకు తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా చేసుకున్నారు. వంగవీటి రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న [more]
వంగవీటి రాధా ఉన్న కొద్దిపాటి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అందరికీ తానే అవకాశాలు కల్పిస్తున్నారు. చివరకు తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా చేసుకున్నారు. వంగవీటి రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాధా ఇప్పటికి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలు అన్ని మారడంతో ఆయన తన సొంత నియోజకవర్గమైన సెంట్రల్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఏ పార్టీ మారినా ఆయనకు ఆ నియోజకవర్గం టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఆ యా పార్టీలకు ముఖ్య నేతలు ఉండటమే. నేతలకు వంగవీటి రాధాయే అవకాశమిస్తున్నారు.
పార్టీలు మారుతూ….
వంగవీటి రాధా గత కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన ఉన్న పార్టీ పవర్ లోకి రాకపోవడంతో విపక్షానికే పరిమితమవుతున్నారు. పోనీ యాక్టివ్ గా ఉన్నారా? అంటే అదీ కన్పించడం లేదు. వంగవీటి రంగా వర్థంతి, జయంతి కార్యక్రమాలకు హాజరవ్వడం, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని రొటీన్ డైలాగ్ చెప్పడం తిరిగి గాయబ్ కావడం సాధారణ ప్రక్రియలా మారిపోయింది. వంగవీటి రాధా ముఖ్య అనుచరులకు సయితం ఆయన అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయన వర్గం కూడా క్రమంగా దూరమయిందని చెబుతున్నారు. వంగవీటి రాధాకు రాజకీయ భవిష్యత్ లేదనే వారు తలో పార్టీకి జారుకుంటున్నారు.
అనుచరుల్లో నిరాశ…..
అధికారం లేకుండా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటామన్నది వారి ప్రశ్న. ఇక ఏ పార్టీలో చేరినా వంగవీటి రాధాకు సీటు దక్కడం కష్టమే. ఆయన ఇప్పటికే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల కండువా కప్పుకున్నారు. ప్రస్తుతానికి టీడీపీలోనే వంగవీటి రాధా ఉన్నారు. టీడీపీకి భవిష్యత్ కన్పించడం లేదు. టీడీపీని వీడాలని ఆయన కు గట్టి వత్తిళ్లే వస్తున్నాయి. అనుచరులంతా జనసేనలో చేరాలని కోరుతున్నారు. కానీ వంగవీటి రాధా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఆలోచేనగా ఉంది. పరిస్థితిని బట్టి స్టెప్ వేయాలన్నది వంగవీటి రాధా ఆలోచన.
జనసేనలోకి వెళ్లినా….
సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధాకు పట్టుంది. తన తండ్రి రంగా అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే మల్లాది విష్ణు చేరిన కారణంగా రాధా టీడీపీలో చేరారు. టీడీపీలో అక్కడ బలమైన నేత బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయనకు తప్పించి చంద్రబాబు టిక్కెట్ వంగవీటి రాధాకు ఇచ్చే అవకాశం లేదు. జనసేన లో చేరి పోటీ చేద్దామన్నా బీజేపీ, జనసేన సంయుక్తంగా పోటీ చేస్తాయి. కృష్ణా జిల్లాలో బీజేపీకి ఉన్న ఏకైక బలమైన స్థానం సెంట్రల్ నియోజకవర్గం. దీంతో అది బీజేపీకి కేటాయించే అవకాశముంది. సో. రాధా ఎలాంటి స్టెప్ తీసుకున్నా సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ దక్కడం ఏ పార్టీలోనైనా కష్టమే.