వంగవీటిని వదిలిపెట్టడం లేదుగా?

వంగవీటి రంగా ను మరోసారి రాజకీయంగా వాడుకుంటున్నారు. వంగవీటి రంగా పేరు చెప్పి రాజకీయంగా ప్రత్యర్థికి నష్టం చేకూర్చాలని ఒకరు ప్రయత్నిస్తున్నారు. దానిని పక్కదోవ పట్టించేందుకు మరొక [more]

Update: 2021-01-03 14:30 GMT

వంగవీటి రంగా ను మరోసారి రాజకీయంగా వాడుకుంటున్నారు. వంగవీటి రంగా పేరు చెప్పి రాజకీయంగా ప్రత్యర్థికి నష్టం చేకూర్చాలని ఒకరు ప్రయత్నిస్తున్నారు. దానిని పక్కదోవ పట్టించేందుకు మరొక అంశాన్ని తెరపైకి తెస్తున్నది మరొక పార్టీ. వంగవీటి రంగా హత్య జరిగి దాదాపు ముప్ఫయి ఏళ్లు దాటుతుంది. అయినా ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా ఎప్పుడూ హాట్ టాపిక్. ఇక ఎన్నికలు వస్తే ఆయన బొమ్మ పెట్టుకుని ఊరేగే వాళ్లు అనేక మంది.

బలమైన నేతగా….

వంగవీటి రంగా బలమైన నేత. కాపు సామాజికవర్గానికే కాకుండా పేదల పక్షపాతిగా ఆయనకు విజయవాడ నగరంలో ఇప్పటికీ అనేక మంది అభిమానులున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నేత. కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా వంగవీటి రంగా ఆవిర్భవించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగే సమయంలో వంగవీటి రంగా హత్య కు గురయ్యారు. వంగవీటి రంగా హత్య జరిగి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పేరు లేకుండా బెజవాడ రాజకీయాలను చూడలేం. అనేక గ్రామాల్లో రంగా విగ్రహాలను నెలకొల్పి తమ అభిమానాన్ని చాటుకుంటారు.

ప్రతి ఎన్నికల సమయంలోనూ…..

ఇప్పుడు మరోసారి వంగవీటి రంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. వంగవీటి రంగా కుమారుడు రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ప్రతి ఎన్నికల్లోనూ వంగవీటి రంగా హత్యకు టీడీపీకి ముడిపెడుతూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గం ఎటువైపు మొగ్గు చూపితే వారికే అధికారం. ఇప్పుడు ఎన్నికలంటూ ఏపీలో ఏమీ లేకపోయినా మరోసారి వంగవీటి రంగా హత్య చర్చనీయాంశంగా మారింది.

విశాఖ రాజకీయాల్లోకి….

విశాఖ రాజకీయాల్లోకి వంగవీటి రంగా వచ్చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో మూడో నిందితుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అంటూ వైసీపీ ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. వెలగపూడిపై ఇటీవల భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. వాటికే పరిమితం కాకుండా వంగవీటి రంగా హత్య కేసును కూడా వైసీపీకి తెరపైకి తేవడం రాజకీయంగా లబ్దికోసమేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద మరోసారి వంగవీటి రంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.

Tags:    

Similar News