వసంతకు వార్నింగ్ ఎందుకంటే?

వ‌సంత కృష్ణప్రసాద్‌.. కృష్ణాజిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు ఓడించి తొలిసారి పాగా వేసిన నాయ‌కుడు. వ‌సంత నాగేశ్వర‌రావు [more]

Update: 2020-02-22 12:30 GMT

వ‌సంత కృష్ణప్రసాద్‌.. కృష్ణాజిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు ఓడించి తొలిసారి పాగా వేసిన నాయ‌కుడు. వ‌సంత నాగేశ్వర‌రావు రాజ‌కీయ వార‌సుడిగా రంగ ప్రవేశం చేసిన కృష్ణప్రసాద్‌ మైల‌వ‌రంలో వైసీపీ త‌ర‌పున పాగా వేశారు. దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావును ఓడించాల‌ని దాదాపుగా రెండున్నర ద‌శాబ్దాలుగా పోరాటం చేసిన వ‌సంత కృష్ణ ప్రసాద్ ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఆఫ‌ర్ చేసిన విజ‌య‌వాడ ఎంపీ సీటు వ‌దులుకుని మ‌రి మైల‌వ‌రం టిక్కెట్ తీసుకున్నారు.

లైన్ దాటొద్దని….

వైఎస్ ఫ్యామిలీతో గ‌త నుంచి ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో అన‌తి కాలంలోనే సీఎం జ‌గ‌న్‌కు మిత్రుడిగా మారారు. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో ఉన్నప్పటికీ టికెట్ విష‌యంలో విభేదాల నేప‌థ్యంలో వైసీపీలోకి వ‌చ్చి పంతం నెగ్గించుకున్నారు. మైల‌వ‌రం రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న వ‌సంత‌ కృష‌్ణ ప్రసాద్ కు ఇప్పుడు వైసీపీలోని సీనియ‌ర్ల నుంచి వార్నింగ్ వ‌చ్చిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణే స్వయంగా వ‌సంత‌ను పిలిపించి చ‌ర్చించార‌ని, పార్టీలైన్‌ను దాటొద్దని వార్నింగ్ ఇచ్చార‌ని అంటున్నారు.

సర్దుకుపోవాల్సిందేనంటూ….

కొద్ది రోజుల‌ కింద‌ట నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యక‌ర్తలు, త‌న అనుచ‌రులు, సానుభూతిప‌రుల‌తో స‌మావేశ‌మైన వ‌సంత‌ కృష్ణ ప్రసాద్ రాజ‌ధానిపై కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు మాత్రం రాజ‌ధాని అమ‌రావ‌తి త‌ర‌లిపోవ‌డం ఇష్టమా? నాకు కూడా అమ‌రావ‌తి ఇక్కడే ఉండాల‌ని ఉంది. కానీ, ఏం చేస్తాం. పార్టీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించే శ‌క్తి నాకు లేదు. నాకే కాదు.. పార్టీలో ఎవ‌రికీ లేదు. సో.. స‌ర్దుకు పోవాల్సిందే. అమ‌రావ‌తిని ఇక్కడి నుంచి త‌ర‌లిస్తే మ‌నం మ‌ద్దతివ్వడం త‌ప్ప ఏమీ చేయ‌లేం. అని వ‌సంత కృష్ణప్రసాద్‌ ఆ సమావేశంలో బాహాటంగానే త‌న మ‌న‌సులోని మాట‌ను వెల్లడించారు. పదే పదే వసంత అదే వ్యాఖ్యలు చేస్తున్నారు.

అందుకే సైలెంట్ గా…..

ఈ వ్యాఖ్యలు వైసీపీ వ్యతిరేక మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అయ్యారు. ఈ ప‌రిణామంతో జ‌గ‌న్ ఈ విష‌యంపై దృష్టి పెట్టారు. ఒక్క వ‌సంత కృష్ణప్రసాద్‌ అనే కాకుండా అస‌లు రాజ‌ధానిపై మాట్లాడుతున్న ఎమ్మెల్యేల జాబితా తెప్పించుకుని వారి వారి వ్యాఖ్యలను నిశితంగా గ‌మ‌నించారు. కొంద‌రు అనుకూలంగా మాట్లాడితే మ‌రికొంద‌రు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో జ‌గ‌న్ అస‌లు ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా రాజ‌ధానిపై మాట్లాడొద్దని మంత్రి బొత్సతో చెప్పించారు. మ‌రీ ముఖ్యంగా వ‌సంత కృష్ణప్రసాద్‌ కు బొత్స వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏం చెప్పాల‌నుకున్నా.. పార్టీలోనే చెప్పాలి కానీ.. మీటింగులు పెట్టి చెబితే.. అది జ‌గ‌న్‌పై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. ఇది మంచిదికాదు అని హెచ్చరించ‌డంతో అప్పటి నుంచి వ‌సంత సైలెంట్ అయిపోయార‌ట‌! సో.. ఇదీ వ‌సంత వార్నింగ్ వెనుక ఉన్న స్టోరీ.

Tags:    

Similar News