వాసిరెడ్డి వాయిస్ పెంచాల్సిందే… ?

ఆమె వైసీపీలో చాలా ముందుగానే చేరిపోయారు. ఆమె జగన్ కి అత్యంత నమ్మకస్థురాలైన నాయకురాలిగా కూడా పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఆమెకు ఎమ్మెల్యే కావాలని [more]

Update: 2021-08-24 13:30 GMT

ఆమె వైసీపీలో చాలా ముందుగానే చేరిపోయారు. ఆమె జగన్ కి అత్యంత నమ్మకస్థురాలైన నాయకురాలిగా కూడా పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఆమెకు ఎమ్మెల్యే కావాలని ఆశ ఉండేది. అయితే అది నెరవేరలేదు. కనీసం ఎమ్మెల్సీగా అయినా జగన్ పంపిస్తారు అనుకుంటే ఆ ముచ్చటా తీరలేదు. అయితే ఆమె అభీష్టానికి ఆమె భావాలకు తగిన పదవే దక్కింది. అదే మహిళా కమిషన్ చైర్ పర్సన్. వాసిరెడ్డి పద్మ ఈ పదవిలో రెండేళ్ళుగా పనిచేస్తున్నారు. ఆమెలో వామపక్ష భావజాలం ఎక్కువ. అయితే వైసీపీ లాంటి పార్టీలలో ఆమె ప్రస్థానమే కాస్త ఆశ్చర్యకరం. కానీ ఆమె గట్టిగా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు అని పేరు.

సవాల్ గానే….?

ఇదిలా ఉంటే ఏపీలో మహిళల మీద దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడు రక్షాబంధన్ దినోత్సవ వేళ కూడా విపక్ష నాయకులు ఏపీలో మహిళలకు భద్రత లేదు అన్న అంశాన్నే హైలెట్ చేస్తూ గ్రీట్ చేయడం బట్టి చూస్తే వారు ఎంతలా ఈ ఇష్యూని ఫోకస్ చేస్తున్నారో అర్ధమవుతోంది. ఇక ఏపీలోనే కాదు దేశంలో చాలా చోట్ల కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా కూడా పెరిగిన సాంకేతికత కూడా దానికి మరో కారణంగా ఉంది. ఈ నేపధ్యంలో మహిళా సమస్యల మీద తక్షణం స్పందించాల్సిన కీలకమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కి కూడా ఈ దాడులు ఒక సవాల్ గా ఉన్నాయి.

డెఫెన్స్ కోసమే …

ఏపీలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అధికార పక్షం నుంచి డిఫెండ్ చేసుకోవడానికి పెద్దగా ఎవరూ లేరన్న పరిస్థితి ఉంది. దాంతో ఆత్మ రక్షణలో ప్రభుత్వం పడిపోతోంది. ఈ నేపధ్యంలో వాసిరెడ్డి పద్మ ముందుకు వచ్చారు. బహుశా ప్రభుత్వ వర్గాల సూచనలతోనే ఆమె జిల్లా టూర్లు వేస్తున్నారు అనుకోవాలి. ఆమె మేధావులు, మహిళా సంఘాలతో కలసి మహిళా సాధికారిత మీద డిబేట్లు ప్రతీ జిల్లాలో నిర్వహిస్తున్నారు. అదే సమయంలో మహిళా భద్రత విషయం మీద కూడా ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తూ మాట్లాడుతున్నారు. గత చంద్రబాబు హయాంలో ఏపీలో దారుణాలు మహిళల మీద జరిగినా కూడా స్పందించారా అంటూ ఆమె నిగ్గదీస్తున్న తీరు విపక్షాలకు కొంత ఇరకాటమే అని చెప్పాలి.

ఢీ కొడుతున్నారా…?

ప్రభుత్వంలో ఉన్నపుడు అన్ని కళ్ళూ అటు వైపే ఉంటాయి. అందరూ అటే చూస్తారు కూడా. ఇక మరో వైపు విపక్ష టీడీపీకి అతి పెద్ద బలం అనుకూల మీడియా. దాంతో ఏ చిన్న ఘటన జరిగినా క్షణాలలో దాన్ని హైలెట్ చేస్తూ సర్కార్ మీద బురద జల్లేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇది కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. దాంతో ఇపుడు మళ్లీ వాసిరెడ్డి పద్మ లాంటి వారి అవసరం వచ్చింది అంటున్నారు. ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నపుడు బాగానే విపక్షాన్ని ఢీ కొట్టేవారు. ఇపుడు కూడా ఆమె వాయిస్ పెంచాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. దీంతో ఆమె కూడా పొలిటికల్ గా హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వాసిరెడ్డి పద్మ రెడీ అంటున్నారు. చంద్రబాబుని బాగానే ఢీ కొడుతున్నారు.

Tags:    

Similar News