వసుంధరకు ఇష్టంలేదా?

వసుంధరరాజే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. వసుంధర రాజే 70 సంవత్సరాలు దాటాయి. దీంతో ఆమె బీజేపీ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే మూడేళ్ల తర్వాత [more]

Update: 2020-07-22 17:30 GMT

వసుంధరరాజే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. వసుంధర రాజే 70 సంవత్సరాలు దాటాయి. దీంతో ఆమె బీజేపీ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే మూడేళ్ల తర్వాత జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు వసుంధర రాజే నేతృత్వంలో జరగకపోవచ్చు. ఒకవేళ ఆ ఎన్నికల్లో బీజేపీ వచ్చినా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవచ్చు. అయితే వసుందరరాజేలో ఒకే ఒక నమ్మకం. తనకు యడ్యూరప్ప లాగా మరోసారి బీజేపీ అధిష్టానం మినహాయింపు నిస్తుందని.

సీన్ అర్థమయిందా….?

వసుంధర రాజే పై అనేక ఆరోపణలున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదంటారు. అభివృద్ధి కూడా అంతంత మాత్రమే. వసుంధర రాజే పై ప్రజల్లో అసంతృప్తి ఉందని తెలిసినా బీజేపీ అధిష్టానం ఎన్నికల ముందు వరకూ ఓపికపట్టింది. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆమె ప్రమేయం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వసుంధర రాజేకు సీన్ అర్థమయింది. మరోసారి గెలవాలన్న రాజే ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆమె కొద్దికాలం నుంచి సైలెంట్ గా ఉంటున్నారు.

సచిన్ పైలట్ వస్తే…..

నిజానికి సచిన్ పైలట్ బీజేపీకి దగ్గర కావడం వసుంధరరాజేకు ఎంత మాత్రం ఇష్టం లేదంటారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తన తర్వాత స్థానం పైలట్ కు దక్కుతుందేమోనన్న భయం ఒకవైపు ఉండగా, తన వారసుడికి కూడా భవిష్యత్తులో అవకాశం దక్కదేమోనన్న ఆందోళనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే రాజస్థాన్ రాజకీయాల్లో ఇంత జరుగుతున్నా వసుంధర రాజే మాత్రం మౌనంగా ఉన్నారంటారు.

అందుకే దూరం పెట్టి…..

ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ను కూడా వసుంధర రాజే పెద్దగా విమర్శించింది లేదు. ఆమె టార్గెట్ అంతా సచిన్ పైలట్. అందుకే బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకుందామనుకున్న సచిన్ పైలట్ కు వసుంధర రాజే పరోక్షంగా దెబ్బతీశారని చెబుతారు. ఆమె గెహ్లాత్ ప్రభుత్వం కూలిపోవడానికి అనుకూలంగా లేరు. ఇది అర్ధమైన సచిన్ పైలట్ తాను బీజేపీకి దూరంగా ఉంటానని ప్రకటించారంటారు.

Tags:    

Similar News