ఎమ్మెల్యే వెలగపూడి యూటర్న్: టీడీపీ గ్రాఫ్ పడిపోతోందా…?
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన విశాఖ జిల్లాలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. నిజానికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్ [more]
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన విశాఖ జిల్లాలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. నిజానికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్ [more]
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన విశాఖ జిల్లాలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. నిజానికి వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఇచ్చిన గట్టి పోటీతో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఎదురుగాలి ఎదుర్కొంది. అయినప్పటికీ.. విశాఖ ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు నియోజకవర్గాలు మాత్రం టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. వీటిలోనూ కీలకమైన నియోజకర్గం తూర్పు. ఇక్కడ నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ.. దూసుకుపోతున్నారు బాబు సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణబాబు. ఏటికేడు వెలగపూడి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అంతేకాదు, పార్టీ అన్నా, చంద్రబాబు నాయకత్వం అన్నా కళ్లు మూసుకుని జైకొట్టే వెలగపూడికి పార్టీలో మంచి పేరుంది. 2009 నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించిన ఆయన హ్యాట్రిక్ కొట్టారు.
హ్యాట్రిక్ విజయాలు సాధించిన….
ఇక, నియోజకవర్గంలోనూ ఆయనకు మంచి గ్రాఫ్ ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తనది కాకపోయినా.. పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఏ పిలుపు ఇచ్చినా కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అనేక కాంట్రవర్సీలకు ఆయన కేరాఫ్‌గా కూడా మారుతున్నారు. అయితే, ఇప్పుడు అమరావతి విషయంలో నిన్న మొన్నటి వరకు చంద్రబాబు బాటలోనే నడిచిన వెలగపూడి.. తాజాగా యూటర్న్ తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బాబు నిర్ణయానికి…..
జగన్ సర్కారు విశాఖను పాలనా రాజధానిగా చేస్తుండడంతో దీనిని ఆదిలో వ్యతిరేకించిన వెలగపూడి చంద్రబాబు బాటలో కొన్నాళ్లు నడిచారు. అయితే, ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ విషయంలో ఇంకా పట్టుకుని ఆందోళన చేస్తే… విశాఖలో తన రాజకీయ అస్తిత్వానికే మోసం వస్తుందని భావించిన వెలగపూడి పార్టీ కార్యక్రమాలపై యూటర్న్ తీసుకున్నారు. తాజాగా చంద్రబబు ఇచ్చిన ఆందోళన పిలుపునకు ఆయన స్పందించలేదు. పైగా ఇంటి నుంచి కూడా బయటకు రాలేదు. అంటే.. దాదాపు విశాఖను పాలన రాజధాని చేసినందుకు ఆయన సంతోషిస్తున్నారనే అంటున్నారు అనుచరులు.
తాను విలన్ అవుతానని…
ఒకవేళ ఇప్పుడు ఆందోళన చేస్తే.. విశాఖ ప్రజల్లో తనొక్కడే విలన్ అవుతారని, మిగిలిననాయకులు అందరూ హీరోలుగా మారతారని కూడా వెలగపూడి భావిస్తున్నట్టు తెలుస్తోంది. నగరంలో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో మిగిలిన ముగ్గురు బాబు మాటలు లైట్ తీస్కొంటూ రాజధానిని స్వాగతిస్తోన్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు వెలగపూడి కూడా అదే బాట పట్టనున్నారు. మొత్తానికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న వెలగపూడి ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారడం గమనార్హం. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.