వేటు ఖాయమయిపోయిందట… ఎప్పుడనేదే?

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్యాబినెట్ నుంచి ముందుగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టి ప్రచారమే నడుస్తుంది. దేవాలయాలపై వరుస సంఘటనలు, క్షత్రియ [more]

Update: 2021-01-16 11:00 GMT

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ క్యాబినెట్ నుంచి ముందుగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టి ప్రచారమే నడుస్తుంది. దేవాలయాలపై వరుస సంఘటనలు, క్షత్రియ సంఘాలు మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయంటూ వత్తిడి తేవడం, ఆయన శాఖలో అవినీతి అక్రమాలకు చెక్ పడకపోవడం వంటివి జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మైనస్ మార్కులు పడ్డాయని అంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో…

ఫలితంగా రెండున్నరేళ్ల తరువాత క్యాబినెట్ లో మార్పు చేర్పులు జరిగితే డిమోషన్ కావలిసిన వెల్లంపల్లికి ముందుగానే ఉద్వాసన తప్పకపోవచ్చని పొలిటికల్ విశ్లేషకుల అంచనా. ఆయన పనితీరుపైనా అధిష్టానం అసంతృప్తి తోనే ఉందని తెలుస్తుంది. వెరసి ఇవన్నీ వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవికి ఎసరు పెట్టడం ఖాయమనే ప్రచారం అమరావతిలో జోరందుకుంది.

బిజెపి టార్గెట్ వెల్లంపల్లి …

బిజెపి సైతం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని గట్టిగా టార్గెట్ చేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దానిపై మంత్రి స్పందిస్తున్న తీరు కమలం పార్టీకి ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. అన్నింటికి మించి వైసిపి మంత్రులందరిలోకి వెల్లంపల్లి శ్రీనివాస్ బిజెపి ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది కూడా కాషాయం పార్టీని వెల్లంపల్లిని మరింత లక్ష్యం చేసుకునేలా చేసిందని భావిస్తున్నారు.

ఇంటా బయటా…..

ఎపి లో అంతర్వేది మొదలు రామతీర్ధం వరకు జరిగిన సంఘటనల్లో అధికారపార్టీకి కలిసొచ్చేలా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహారం ఎక్కడా లేదన్నది సొంత పార్టీలో కూడా అసంతృప్తుల మాట. ఇలా ఇంటా బయటా వెల్లంపల్లికి చేదు అనుభవాలే ఎదురు అవుతున్న నేపథ్యంలో దేవాదాయ మంత్రిని ఈ సంఘటలకు బాధ్యత వహించి రాజీనామా చేయించేస్తే ఒక పని అయిపోతుందని ఫ్యాన్ పార్టీలో వత్తిడి పెరుగుతుందట. అయితే జగన్ ఇప్పుడు చర్యలు తీసుకుంటారా మరికొంతకాలం వేచి చూసి వెల్లంపల్లి శ్రీనివాస్ పై వేటు వేస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News