మంత్రి గారికి మైనస్‌గా మారిన టీడీపీలో సెగలు
సాధారణంగా ప్రత్యర్థి పార్టీలో ఏర్పడే వివాదాలు.. పక్కనున్న పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్లస్ అవుతాయి. లేదా.. నాయకులే ఆ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇది [more]
సాధారణంగా ప్రత్యర్థి పార్టీలో ఏర్పడే వివాదాలు.. పక్కనున్న పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్లస్ అవుతాయి. లేదా.. నాయకులే ఆ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇది [more]
సాధారణంగా ప్రత్యర్థి పార్టీలో ఏర్పడే వివాదాలు.. పక్కనున్న పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ప్లస్ అవుతాయి. లేదా.. నాయకులే ఆ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే.. విజయవాడలో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడి పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు.. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఎదురవుతున్న వ్యతిరేకతను వైసీపీకి అనుకూలంగా మార్చుకోలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
కేశినేని తీరును….
ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీడీపీలో ముఖ్యంగా పశ్చిమ నియోజ కవర్గంలో నేతల మధ్య తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ, విజయవాడ టీడీపీ ఇంచార్జ్ బుద్దా వెంకన్న.. ఎంపీ కేశినేని నాని కేడర్‌ల మధ్య వివాదాలు నిత్యం సాగుతున్నాయి. తాజాగా అవి రోడ్డెక్కాయి కూడా. నాయకులు ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. ఏదైనా ఉంటే.. చంద్రబాబుకు చెప్పు కోవాలని.. తనను అడగొద్దని ఎంపీ నాని చెప్పేశారు. దీంతో పరిస్థితి బుద్ధా వెంకన్న చేయి దాటిపోయింది. దీనిని కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
తమకు రక్షణ లేకపోతే….?
తమపై ఎంపీ వర్గం దాడి చేస్తున్నా.. బుద్దా వెంకన్న ఏమీ చేయలేక పోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని సుమారు 20 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. వీరంతా.. పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. తమకు రక్షణలేనప్పుడు.. తాము పార్టీలో ఎలా ఉంటామని కూడా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. వైసీపీ నేతలు చోద్యం చూస్తున్నారు. గతంలో ఇలాంటి పరిణామమే సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీలో చోటు చేసుకున్నప్పుడు .. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా .. రాత్రికి రాత్రి చక్రం తిప్పి.. వారిని తన పార్టీలోకి చేర్చుకున్నారు.
పార్టీలోకి తీసుకు రావడంలో….
ఇప్పుడు ఇదే అవకాశం మంత్రి వెల్లంపల్లికి వచ్చినా.. ఆయన మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు కనుక ఆయన నిలబడితే.. టీడీపీలో ఏర్పడిన ఈ గ్యాప్‌లో కేడర్ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఆయన మాత్రం తనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నెల్లూరులోనూ చోటు చేసుకుంది. గత ఏడాది కార్పొరేషన్ కు పోటీ చేసిన వారిలో పది మంది వార్డు సభ్యులను అనిల్ తనకు మద్దతుగా మార్చుకున్నారు. ఇలాంటి పరిణామాలు తెలిసి కూడా మంత్రిగారు తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం..