ఎంత భజన చేస్తే అంత మంచిదా?.. మంత్రుల్లో టెన్షన్
`ఎంత భజన చేస్తే.. అంత మంచిది!`- ఇదీ ఇప్పుడు వైసీపీ మంత్రుల మధ్య వినిపిస్తున్న టాక్. త్వరలోనే మంత్రి పదవుల ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు [more]
`ఎంత భజన చేస్తే.. అంత మంచిది!`- ఇదీ ఇప్పుడు వైసీపీ మంత్రుల మధ్య వినిపిస్తున్న టాక్. త్వరలోనే మంత్రి పదవుల ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు [more]
'ఎంత భజన చేస్తే.. అంత మంచిది!'- ఇదీ ఇప్పుడు వైసీపీ మంత్రుల మధ్య వినిపిస్తున్న టాక్. త్వరలోనే మంత్రి పదవుల ప్రక్షాళన ఉన్న నేపథ్యంలో వాటిని కాపాడుకునేందుకు మంత్రులు ప్రయాసలు పడుతు న్నారు. ఈ క్రమంలోనే మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలుపు గుర్రం ఎక్కించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ.. చాలా మంది మంత్రుల్లో గుబులు పట్టుకుంది. తమ పదవులు ఉంటాయా ? ఊడతాయా ? అని బెంగపడుతున్నారు. మరీ ముఖ్యంగా పినిపే విశ్వరూప్, వెలంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని,. తానేటి వనిత, రంగనాథరాజు, మేకతోటి సుచరిత వంటివారి పేర్లు తీసేసే వారి జాబితాలో ఉన్నట్టు బాహాటం గానే వినిపిస్తున్నాయి.
సొంత సర్వేలతో….
దీంతో ఎవరికి వారు సొంత సర్వేలు ప్రారంభించారు. తమ పనితీరు ఎలా ఉంది ? ఈ రెండేళ్ల కాలంలో తమపై వచ్చిన ఆరోపణలు ఏంటి ? ముఖ్యంగా జగన్ దగ్గర తమకు వచ్చిన మార్కులు ఎన్ని.. వంటి అనేక అంశాలపై వారు పరోక్షంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు అనుమానం ఉన్నవారు.. భజనను తీవ్రం చేశారనే వాదన ఇప్పుడు ఏపీలో అధికార పార్టీలోనే వినిపిస్తోంది. తాజాగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్.. మహాశివరాత్రిని పురస్కరించుకుని.. గుంటూరుజిల్లాలోని కోటప్పకొండ తిరునాళ్లకు వెళ్లారు. అక్కడ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
రేంజ్ పెంచి మరీ….
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడు.తూ.. ప్రతి మాటకు ముందు.. సీఎం జగన్‌ను ప్రస్తుతించారు. సీఎం ఆశీర్వాదం, ఆశీస్సులతోనే తాను పట్టువస్త్రాలు తీసుకువచ్చానని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. వాస్తవానికి ఈయనకుముందు స్వామిని దర్శించుకున్న హోం మంత్రి సుచరిత కూడా మాటకు ముందు .. తర్వాత కూడా.. సీఎం జగన్‌ను కొనియాడే పనిపెట్టుకున్నారు. అయితే.. గతంలోనూ వీరుసీఎంను ప్రశంసించినా.. ఇప్పుడు మాత్రం దీనిని మరింత రేంజ్‌కు పెంచడం.. ఆసక్తిగా మారింది. కానీ, తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. జగన్‌ను ఎంత ప్రశంసించినా.. ప్రభుత్వానికి మచ్చలు తీసుకువచ్చేలా వ్యవహరించిన వారిని ఖచ్చితంగా తప్పించడం ఖాయమని అంటున్నారు. మరి వీరి ప్రశంసలు ఏమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.