ఈ మంత్రికి ఇంత గుర్తింపు ఎందుకు వచ్చిందంటే?
మంత్రిగా దూకుడు ప్రదర్శించే నేతలకు పార్టీపై పట్టు అంతగా ఉంటుందని చెప్పలేం. గతంలో పలు పార్టీలు, మంత్రుల విషయంలో ఇలాంటి పరిణామమే కనిపించింది. మంత్రిగా సక్సెస్ అయిన [more]
మంత్రిగా దూకుడు ప్రదర్శించే నేతలకు పార్టీపై పట్టు అంతగా ఉంటుందని చెప్పలేం. గతంలో పలు పార్టీలు, మంత్రుల విషయంలో ఇలాంటి పరిణామమే కనిపించింది. మంత్రిగా సక్సెస్ అయిన [more]
మంత్రిగా దూకుడు ప్రదర్శించే నేతలకు పార్టీపై పట్టు అంతగా ఉంటుందని చెప్పలేం. గతంలో పలు పార్టీలు, మంత్రుల విషయంలో ఇలాంటి పరిణామమే కనిపించింది. మంత్రిగా సక్సెస్ అయిన వారు.. దూకుడు ప్రదర్శించిన వారు నియోజకవర్గంలోను, పార్టీపైనా పట్టు కోల్పోయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడో అరుదుగా మాత్రమే పార్టీ పైనా.. పదవిపైనా కూడా పట్టు నిలుపుకొన్న వారు కనిపిస్తారు. ఇలాంటి వారిలో వైసీపీకి చెందిన నాయకుడు.. విజయవాడ పశ్చిమ ఎంపీ, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. మంత్రిగా ఆయన వివాద రహితుడు.
వివాదాలకు తావు లేకుండా….
గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన వెలంపల్లి శ్రీనివాస్ కి .. జగన్ అనూహ్యంగా మంత్రి పదవి ఇచ్చారు. వాస్తవంగా ఈ పదవి వైశ్య సామాజిక వర్గం కోటాలో సీనియర్ నేతగా ఉన్న విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి రావాలి. అయితే ఆ జిల్లాలో ఉన్న బీసీ సమీకరణలతో పాటు మరో నేత బొత్స అడ్డుపుల్ల వేయడంతో అనూహ్యంగా వెలంపల్లి శ్రీనివాస్ కి ఈ పదవి దక్కింది.వెలంపల్లి శ్రీనివాస్యేడాది కాలంగా ఎక్కడా వివాదానికి తావు లేకుండా ముందుకు సాగుతున్నా రు. వాస్తవానికి దేవాదాయ శాఖ అంటేనే నిత్యం వివాదాలకు కేంద్ర బిందువు. అలాంటి శాఖను తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్నారు.
వాయిస్ విన్పిస్తున్నా ఫోకస్….
ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాను పనిచేసుకుంటూ.. గతంలో ఉన్న అవినీతి మరకలను సైతం చెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి నేతలను వైసీపీ వైపు తిప్పేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు వెలంపల్లి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ శాఖలో ప్రతిపక్షాల నుంచి ఏ చిన్న విమర్శలు వచ్చినా వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. కీలకమైన కృష్ణా జిల్లా రాజకీయాల్లోనూ తన వాయిస్ బలంగానే వినిపిస్తున్నా ఇదే జిల్లా నుంచి బలంగా ఉన్న మరో ఇద్దరు మంత్రులు అయిన కొడాలి నాని, పేర్ని నాని వాయిస్ ముందు ఈయన వాయిస్ పెద్దగా ఫోకస్ కావడం లేదు.
వైసీపీిలోకి తీసుకురావడంలో…..
ఇప్పటికి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ కీలక నేతలను ఆయన వైసీపీలోకి చేర్పించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావును వైసీపీలోకి తీసుకురావడంలో వెలంపల్లి శ్రీనివాస్ కీలకంగా పనిచేశారు. వీరిద్దరు కూడా టీడీపీలో బలంగా ఉన్న వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇక, నియోజకవర్గంలోనూ ప్రత్యర్థి పార్టీ పుంజుకోకుండా.. అన్ని వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా.. వైసీపీ జెండా.. అజెండాలే కనిపిస్తుండడం గమనార్హం. మొత్తంగా మంత్రిగానే కాకుండా.. కీలక నేతగా కూడా వెలంపల్లి శ్రీనివాస్ గుర్తింపు సాధించారనడంలో సందేహం లేదు.