మీరిద్దరూ సైలెంట్ గా ఉండండి… జగన్ ఆదేశాలు
విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ స్పెషల్. పార్టీలు ఏవైనా.. నాయకుల మధ్య రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతుంటాయి. గత ఏడాది వరకు విజయవాడలో టీడీపీ నేతల హవా సాగింది. [more]
విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ స్పెషల్. పార్టీలు ఏవైనా.. నాయకుల మధ్య రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతుంటాయి. గత ఏడాది వరకు విజయవాడలో టీడీపీ నేతల హవా సాగింది. [more]
విజయవాడ రాజకీయాలు ఎప్పుడూ స్పెషల్. పార్టీలు ఏవైనా.. నాయకుల మధ్య రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతుంటాయి. గత ఏడాది వరకు విజయవాడలో టీడీపీ నేతల హవా సాగింది. అఫ్ కోర్స్ .. ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో టీడీపీ నేతలే చక్రం తిప్పుతున్నారనుకోండి. అయితే, వైసీపీకి రెండు కీలక స్థానాల్లో విజయం దక్కింది. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు మంత్రి పదవి కూడా దక్కింది. మల్లాది విష్ణు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి పార్టీని డెవలప్ చేయడంలో ఏంటి ఇబ్బంది ? అనేది ప్రశ్న.\
అధికారులపై వత్తిడి….
కానీ, ఇద్దరి మధ్య కూడా ఆధిపత్య ధోరణలు పొసగుతున్నాయి. గత ఆరు మాసాల కిందటే .. ఇద్దరి మధ్య ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకున్నాయనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏదైనా సిఫారసు చేస్తే.. మంత్రి పట్టించుకునేవారు కాదని, మంత్రి చెప్పిన పనిని ఎమ్మెల్యే విష్ణు చేసేవారు కాదని పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చసాగింది. దీనికి ప్రధాన కారణం.. ఇద్దరికీ కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్ వద్ద మంచి పలుకుబడి.. యాక్సస్ ఉండడమే. మంత్రిగా తాను చెప్పిందే జరగాలని వెలంపల్లి శ్రీనివాస్ పట్టుబడుతున్నారు. అయితే, తాను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సహా కేబినెట్ హోదాలోనే ఉన్నాను కాబట్టి.. నేను చెప్పిందే వినాలని ఇద్దరూ కూడా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.
సోషల్ మీడియాలో….
లాక్‌డౌన్ సమయంలోనూ ఇద్దరూ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారని తెలిసి.. వైసీపీలోనే చర్చ బహిర్గతమైంది. ఇటీవల పార్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారు. అయితే, సెంట్రల్ కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని వెలంపల్లి శ్రీనివాస్ వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇదే సమయంలో పశ్చిమలో పార్టీ కార్యక్రమాలు సరిగా నిర్వహించలేదని విష్ణు వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దీంతో ఇరు వర్గాల మధ్య మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి.
సీఎం వద్దకు వెళ్లడంతో…
జిల్లాలో మిగిలిన నేతలు వీరి మధ్య వార్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎవ్వరూ కూడా మీరెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే వీరి సంగతి ఇలా ఉంటే తూర్పులోనూ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ వర్సెస్ నగర పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌కు కూడా పొసగడం లేదు. మొత్తానికి కీలక నగరంలో మూడు నియోజకవర్గాల్లోనూ పార్టీ నేతలు కలిసి వెళ్లడం లేదు. ఇక ఈ పరిణామాలను గమనిస్తున్న ఇతర మంత్రులు.. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇద్దరినీ సైలెంట్ అవ్వాలనే ఆదేశాలు అందాయట.