అంతా సాయిరెడ్డి వల్లనేనా….?
కొన్ని విషయాల్లో వైసీపీకి స్ట్రాటజీ కొరవడిందనే చెప్పాలి. దీనివల్ల అనవసరంగా టీడీపీకి హైప్ తీసుకుని వస్తుంది. రామతీర్థ ఘటననే తీసుకుంటే వైసీపీ మరోసారి తప్పులో కాలేసింది. విజయనగరం [more]
కొన్ని విషయాల్లో వైసీపీకి స్ట్రాటజీ కొరవడిందనే చెప్పాలి. దీనివల్ల అనవసరంగా టీడీపీకి హైప్ తీసుకుని వస్తుంది. రామతీర్థ ఘటననే తీసుకుంటే వైసీపీ మరోసారి తప్పులో కాలేసింది. విజయనగరం [more]
కొన్ని విషయాల్లో వైసీపీకి స్ట్రాటజీ కొరవడిందనే చెప్పాలి. దీనివల్ల అనవసరంగా టీడీపీకి హైప్ తీసుకుని వస్తుంది. రామతీర్థ ఘటననే తీసుకుంటే వైసీపీ మరోసారి తప్పులో కాలేసింది. విజయనగరం జిల్లాలో రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం అయిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన వెనక కుట్ర దారులు ఎవరన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అప్పటికే టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఆరోపణలతో సరిపెట్టి ఉంటే…?
ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి అంతవరకూ ఊరుకుంటే బాగుండేది. కానీ చంద్రబాబు రామతీర్థ వచ్చే రోజునే పనిగట్టుకుని వెళ్లడం టీడీపీకి హైప్ తెచ్చి పెట్టిందనే చెప్పాలి. విజయసాయిరెడ్డి రామతీర్థ వెళ్లకుండా ఉండి ఉంటే చంద్రబాబు సాదాసీదాగా వెళ్లి వచ్చేవారు. అక్కడ అంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు. మీడియా అటెన్షన్ కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ విజయసాయిరెడ్డి వెళ్లడం వల్లనే ఉదయం 11 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రామతీర్థ ఘటన మీడియాలో హైలెట్ అయింది.
బాబు ఆరోపణలను…..
గత నెల 28వ తేదీన సంఘటన జరిగింది. విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్కక్రమానికి జగన్ వస్తున్నారని తెలిసి ఈ ఘాతుకానికి టీడీపీ నేతలే పాల్పడ్డారన్నది వైసీపీ నేతల ఆరోపణ. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత. ఆయన చేసే విమర్శలు ప్రభుత్వంపైనే ఉంటాయి. వాటిని ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోరు. కానీ ఎప్పుడైతే చంద్రబాబును పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేశారో అప్పడు మాత్రం ఆయనకు మైలేజీ పెరిగిందనే చెప్పాలి.
వ్యూహం లోపించడంతో…..
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే విజయసాయిరెడ్డి అక్కడకు వెళ్లి ఉంటే వైసీపీకి కొంత హైప్ వచ్చి ఉండేది. కానీ చంద్రబాబు వచ్చే రోజునే విజయసాయిరెెడ్డి వెళ్లడం పార్టీకి లాభం కంటే నష్టాన్నే ఎక్కువగా తెచ్చిపెట్టిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద వైసీపీకి వ్యూహం లోపించింది. కేవలం చంద్రబాబు మీద కసి మాత్రమే కన్పిస్తుంది. లేకుంటే విజయసాయిరెడ్డి చంద్రబాబు వచ్చే రోజునే రామతీర్థ వెళ్లి ఉండేవారు కారు. ఇప్పటికైనా వైసీపీ మొండిగా వెళ్లకుండా మనసు పెట్టి ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు.