విజ‌య‌సాయికే ఝ‌ల‌క్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి. అయితే.. ఆ దూకుడు వ్యక్తిగ‌త ఇమేజ్‌ను పెంచ‌క‌పోగా.. పార్టీలోనే వివాదాస్పదం అయ్యేలా చేయ‌డం ప్రస్తుతం చ‌ర్చనీయాంశంగా మారిన విష‌యం. విష‌యంలోకి వెళ్తే తూర్పుగోదావ‌రి [more]

Update: 2020-11-13 06:30 GMT

రాజ‌కీయాల్లో దూకుడు ఉండాలి. అయితే.. ఆ దూకుడు వ్యక్తిగ‌త ఇమేజ్‌ను పెంచ‌క‌పోగా.. పార్టీలోనే వివాదాస్పదం అయ్యేలా చేయ‌డం ప్రస్తుతం చ‌ర్చనీయాంశంగా మారిన విష‌యం. విష‌యంలోకి వెళ్తే తూర్పుగోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన ఓ ఎమ్మెల్యే దూకుడు, దందా మామూలుగా లేద‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ద‌రు ఎమ్మెల్యే దోపిడీకి, అవినీతికి అంతేలేద‌ని అని సొంత పార్టీ నేత‌లే గ‌గ్గోలు పెడుతున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఈ యేడాదిన్నర‌లోనే నియోజ‌క‌వ‌ర్గంలో అక్రమ కేసులు ఎక్కువ అయ్యాయ‌ట‌. ఇవ‌న్నీ స‌ద‌రు ఎమ్మెల్యే క‌నుస‌న్నల్లోనే జ‌రుగుతున్నాయంటున్నారు.

ఆయన చెప్పిందే వేదం….

ఇక టీడీపీలో ఎవ్వరూ రోడ్డుమీద‌కు వ‌చ్చి ఎమ్మెల్యే గురించి ప్రశ్నించే అవ‌కాశం ఇవ్వకుండా ఆయ‌న అక్రమ కేసులు పెట్టించేస్తున్నార‌ట‌. ఆ ఎమ్మెల్యే ఏకంగా పార్టీ కీల‌కనేత విజ‌య‌సాయి రెడ్డికే ఝుల‌క్ ఇచ్చార‌న్న ప్రచారం జిల్లా పార్టీ వర్గాల్లో జ‌రుగుతోంది. స‌ద‌రు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పెళ్లిళ్లు ఎక్కువ‌గా నిర్వహించుకునే.. నోములు ఎక్కువ‌గా చేసుకునే ఓ ప్రముఖ‌ దేవాల‌యం కూడా ఉంది. ఈ దేవాల‌యంలో అభివృద్ధి ప‌నులు, కాంట్రాక్టులు, ఉద్యోగాల భ‌ర్తీ అన్ని విష‌యాల్లోనూ స‌ద‌రు ఎమ్మెల్యే చెప్పిందే వేదం.

ఎమ్మెల్యే ఆరోపణలపై…..

ఆయ‌న‌కు తెలియ‌కుండా చిన్నచీమ కూడా క‌ద‌ల‌డానికి వీల్లేద‌ని హుకుం జారీ చేశార‌ట‌. అదేమ‌ని అడిగిన వారిపై సైతం విరుచుకుప‌డుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో వైసీపీ కీల‌క నేత‌, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఒక‌సారి ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్యట‌న‌కు వెళ్లిన‌ప్పుడు.. స‌దరు ఎమ్మెల్యేపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను నేరుగా ఆయ‌న వ‌ద్దే ప్రస్తావించార‌ట‌. ' ఎమ్మెల్యే గారు మీ ప‌ద్దతేం బాగోలేదు. ఏంటి భారీ ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి' అని అన‌గానే ఆయ‌న వెంట‌నే ఏదో అయిపోయింద‌నే లేదు లేదు.. నాపై ఆరోప‌ణ‌లు ప్రతిప‌క్ష నేత‌ల కుట్ర అనో చెప్పాల‌ని అంద‌రూ అనుకుంటారు.

సాయిరెడ్డికే ఎదురు….

కానీ, అనూహ్యంగా స‌ద‌రు ఎమ్మెల్యే “మేం చిన్నోళ్లం.. మాకు చిన్నవే ఉంటాయి.. మీరు పెద్దోళ్లు.. విశాఖ లో మీకు పెద్దవే ఉన్నాయి క‌దా!“ అని అన‌డంతో విజయసాయిరెడ్డికి షాక్ కొట్టినంత ప‌నైంది. దీంతో ఈ విష‌యాన్ని ఆయ‌న జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లార‌ట‌. కానీ, ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ కూడా ఈ విష‌యంపై ప‌ట్టించుకోలేదు. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యే మ‌రింత రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆనుకున్న ఉన్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే వైసీపీ నుంచే రెండోసారి గెలిచారు. ఆయ‌నతోనూ స‌ద‌రు ఎమ్మెల్యేకు వైరం ఉంది. ఇక‌, మంత్రి క‌న్నబాబు వంటివారుతోనూ మీరు నాకు చెప్పేదేంటి ? అనే ధోర‌ణితోనే స‌ద‌రు ఎమ్మెల్యే ఉన్నార‌ట‌. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News