విజయసాయి ఉడుం పట్టు….?

విశాఖ రాజకీయాలను ఔపాసన పట్టేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ సహా అన్ని పార్టీలలో ఉన్న భూ కబ్జాలదారుల కధల‌న్నీ కూడా కంచికి చేర్చాలనుకుంటున్నారు. దాంతో ఆయన [more]

Update: 2020-12-29 06:30 GMT

విశాఖ రాజకీయాలను ఔపాసన పట్టేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ సహా అన్ని పార్టీలలో ఉన్న భూ కబ్జాలదారుల కధల‌న్నీ కూడా కంచికి చేర్చాలనుకుంటున్నారు. దాంతో ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తినే కాదు, సరికొత్త రాజకీయ ప్రకంపనలనే సృష్టించనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొవడం తప్పు, వాటికి ఎవరు ఆకమించినా స్వచ్చందంగా వైదొలగండి అంటూ వార్నింగ్ టైపులో విజయసాయిరెడ్డి ఇచ్చిన ఝలక్ ఇపుడు విశాఖ రాజకీయాల్లో అతి పెద్ద చర్చగా ఉంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్నది అందరికీ తెలిసిందే.

తమ్ముళ్లకు తప్పదా…?

నిజానికి గత కొన్ని నెలలుగా విశాఖలో భూ కబ్జాల వెలికితీత ఒక నాన్ స్టాప్ ప్రొగ్రాంలా సాగుతోంది. ఇందులో బయట పడుతున్న పేర్లు అన్నీ కూడా టీడీపీ నాయకులు, వారి అస్మదీయులవే కావవడం విశేషం. అందుకే విజయసాయిరెడ్డి మళ్ళీ గట్టి హెచ్చరికలనే పంపించారు. భూములు దురాక్రమణ చేస్తే శిక్ష మామూలుగా ఉండదు, స్టేషన్ బెయిల్ కూడా కొన్నింటికి రాదు, అసలు వీటి మీద క్రిమినల్ కేసులుగా పెట్టి అరెస్టులు చేయిస్తామంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇపుడు విశాఖ రాజకీయాలనే కీలకమైన మలుపు తిప్పే అవకాశం ఉంది.

వేల ఎకరాలు అలా….

విశాఖ సిటీ పరిధిలో వందల వేల ఎకరాలు భూ కబ్జా అయిన సంగతి బహిరంగ రహస్యం. అందులో రెండవ మాటే లేదు. అయితే ఇంతకాలం ఇది ఆరోపణలుగానో, లేక విమర్శలుగానో అంతా చేసుకుంటూ వచ్చారు. ఇపుడు మాత్రం అసలైన సినిమాను చూపించడానికి వైసీపీ రెడీ అయింది. విశాఖ భూముల కబ్జాదారుల పేర్లు అన్నీ కూడా ప్రభుత్వ దగ్గర ఉన్నాయి. దానికి తోడు వైసీపీ వచ్చాక వేసిన సిట్ నివేదిక కూడా ఉంది. దీంతో బస్తీ మే సవాల్ అంటూ సరికొత్త రాజకీయ యుధ్దానికే వైసీపీ రెడీ అవుతోంది. భూములను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని విజయసాయిరెడ్డి కచ్చితంగా చెప్పేశాక టీడీపీ కానీ, కబ్జాలు చేసిన ఇతర పార్టీలవారు కానీ ఏ రకమైన ప్రతి వ్యూహాన్ని అమలు చేస్తారు అన్నది చూడాలి.

వైసీపీలోనూ….

ఇదిలా ఉంటే టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఇపుడు కంగారు పడుతున్నారు. వారు కూడా రాజకీయ నాయకులే. గతంలో కొంతమంది నేతల పేర్లు భూ ఆక్రమణలలో వినిపించినవే . ఇక విజయసాయిరెడ్డి ఏ పార్టీ వారు ఉన్నా కూడా శిక్షలు తప్పవు అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేయడంతో వైసీపీలోనూ కలవరం రేగుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి దూకుడు పట్ల సొంత పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది. అయినా జగన్ కి కుడి భుజం లాంటి నేత కాబట్టి బయటకు ఏమీ అనలేకపోతున్నారు. కానీ ఇపుడు కనుక వైసీపీని కూడా ఆయన టచ్ చేస్తే అటూ ఇటూ మొత్తం రాజకీయం కలగలసిపోయి విశాఖలో భూ కంపం పుడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News