సాయిరెడ్డిని దెబ్బతీస్తే సగం విజయం సాధించినట్లేనట
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ ప్రాంతానికే పరిమితం. ఆయన అక్కడి వరకే రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే అప్పగించారు. రాష్ట్ర [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ ప్రాంతానికే పరిమితం. ఆయన అక్కడి వరకే రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే అప్పగించారు. రాష్ట్ర [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖ ప్రాంతానికే పరిమితం. ఆయన అక్కడి వరకే రాజకీయాలు చేస్తున్నారు. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు మాత్రం విజయసాయిరెడ్డి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కంటే విజయసాయిరెడ్డిని తమ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుండటం విశేషం. ఎందుకు విజయసాయి రెడ్డి విపక్షాలకు టార్గెట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది.
జగన్ అప్పగించిన….
విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో నెంబరు 2 గా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయరెడ్డికి జగన్ ప్రత్యేకంగా రాజ్యసభకు ఎంపిక చేశారు. ఢిల్లీలో లాబీయింగ్ చేయడానికే విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవిని జగన్ ఇచ్చారు. అయితే జగన్ ఇచ్చిన పనిని విజయసాయిరెడ్డి సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ తనంతట తాను బయటకు వచ్చేలా చేయడంలోనూ విజయసాయిరెడ్డి పాత్ర కాదనలేం.
ఉత్తరాంధ్రకే పరిమితం…..
ఇక అధికారంలోకి వైసీపీకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి జగన్ అంతకంటే పెద్దపదవిని ఇచ్చింది లేదు. ఆయనను కేవలం ఉత్తరాంధ్ర రాజకీయాలకే పరిమితం చేశారు. ప్రధానంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించడం వెనక కూడా విజయసాయిరెడ్డి ఆలోచన ఉందని విపక్షాల అనుమానం. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేయడం, వైసీపీకి ఇబ్బందులు కలగడకుండా ప్రయత్నిస్తుండటం విపక్షాలకు ఇబ్బందిగా మారింది.
బాబు నుంచి అందరూ…
అందుకే చంద్రబాబు నుంచి కిందిస్థాయి టీడీపీ నేతల వరకూ విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు జగన్ రాజకీయం విజయసాయి చేతుల్లో ఉందని భావిస్తూ విపక్షాలు ఆయనను టార్గెట్ చేసుకున్నాయి. తొలుత విజయసాయిరెడ్డిని మానసికంగా దెబ్బతీయగలిగితే సగం విజయం సాధించినట్లేనన్నది విపక్షాల భావన. అందుకే అన్ని రకాల ఆరోపణలు ఆయనపై చేస్తున్నారు. భూ కబ్జాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు ఆయనే కారణంగా చూపుతున్నారు. విజయసాయిరెడ్డి ని అన్ని రకాలుగా దెబ్బతీయాలన్నదే ఇప్పడు టీడీపీ ముందున్న సవాల్.