విజయసాయి విలువ తగ్గిపోయినట్లేనా ?

విజయసాయిరెడ్డి అంటేనే జగన్ కి కుడి భుజం అని చెబుతారు. ఆయన మాట్లాడితే దాని వెనక జగన్ ఉన్నారని కూడా భ్రమపడతారు. విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలం దాకా [more]

Update: 2021-04-14 15:30 GMT

విజయసాయిరెడ్డి అంటేనే జగన్ కి కుడి భుజం అని చెబుతారు. ఆయన మాట్లాడితే దాని వెనక జగన్ ఉన్నారని కూడా భ్రమపడతారు. విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలం దాకా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఏకచత్రాధిపత్యమే చేశారు. పార్టీలో ఎటువంటి సీనియర్ నేత అయినా సరే ఆయన ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉండేది. కానీ విశాఖ కార్పోరేషన్ ఎన్నికల తరువాత మాత్రం విజయసాయిరెడ్డి ఫుల్ సైలెంట్ అయ్యారు. ఆయన వూసు అన్నది కూడా పెద్దగా లేకుండా పోయింది.

గుస్సాతో అలా …?

విజయసాయిరెడ్డికి విశాఖ కార్పోరేషన్ లో వైసీపీని గెలిపించే బాధ్యతలను జగన్ పూర్తిగా అప్పగించేశారు. ఆయనే మొత్తం అన్నట్లుగా తిరిగారు ఇక పార్టీ ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది. మరో వైపు ఆయన తానే మొత్తం 98 వార్డులకు కార్పోరేటర్లను సెలెక్ట్ చేశారు. నాయకులను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారు. వారూ వీరు అని తేడా లేకుండా అందరినీ తన వెనకన తిప్పుకున్నారు. విజయసారధిగా తానే ఉండాలని ఉబలాటపడ్డారు. చివరికి మాత్రం సీన్ రివర్స్ అయింది బొటాబొటీ మెజారిటీతో వైసీపీ గెలవడంతో జగన్ గుస్సా అయ్యారని అంటున్నారు.

యాక్టివిటీస్ లేవు…

దాంతో విజయసాయిరెడ్డి నాటి నుంచి పార్టీ యాక్టివిటీస్ ని పూర్తిగా తగ్గించేశారు. మునిసిపలి ఎన్నికల్ అయిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీ జనాలను కూడా పెద్దగా కలుసుకోవడంలేదు అంటున్నారు అదే విధంగా బయట కార్యక్రమాలకు కూడా అటెండ్ కావడాన్ని పూర్తిగా తగ్గించేశారు. ఆయన ఢిల్లీలో ఉంటున్నారా లేక తన దత్తత సిటీ విశాఖలో మకాం చేస్తున్నారా అన్నది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఇక పార్టీలో ఏం జరుగుతోంది. ఎవరిని కలవాలి, ఏం చేయాలి అని తెలియక నాయకులు కూడా సతమతమవుతున్నారుట. మరో వైపు విశాఖ పార్టీ విషయాలను కూడా విజయసాయిరెడ్డి పట్టించుకోవడంలేదు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

డౌటేనా…?

ఇక విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు వచ్చే ఏడాదితో ముగుస్తుంది. మరో మారు దాన్ని రెన్యూల్ చేయాలంటే అది జగన్ చేతిలోనే ఉంది. అంటే గట్టిగా ఏడాది కూడా ఆయన ఎంపీ పదవి లేదని అర్ధమవుతోంది. జగన్ కి ఇష్టుడిగా ఒకనాడు మెలిగిన విజయసాయిరెడ్డి ఇపుడు ఎందుకో దూరం అయ్యారని అంటున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన పూర్తిగా ట్విట్టర్ పిట్టగానే మారిపోయారు అంటున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీలను కూడా సరిగ్గా కలుపుకుని పోలేకపోయారని అంటున్నారు. దాని వల్లనే మొదట్లో మంచిగా ఉన్న రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా జగన్ కి బద్ధ వ్యతిరేకి అయ్యారని కూడా పార్టీలో కామెంట్స్ ఉన్నాయి. మొత్తానికి విజయసాయిరెడ్డికి పార్టీలో విలువ తగ్గిందని కూడా టాక్. ఇదే సీన్ కొనసాగితే ఆయనకు రాజ్యసభ సీటు డౌట్ లో పడినట్లే అన్న చర్చ అయితే మాత్రం ఉంది.

Tags:    

Similar News