Ycp : ఇక పని ఏమీ ఉండదట… ఖాళీయేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోనార్క్. ఆయన చెప్పిందే వేదం. ఆయన నిర్ణయాలే పార్టీలో అమలవుతాయి. మరి జగన్ ఎవరి మాట వింటారు అన్న ప్రశ్నకు రెండు [more]

Update: 2021-10-15 15:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మోనార్క్. ఆయన చెప్పిందే వేదం. ఆయన నిర్ణయాలే పార్టీలో అమలవుతాయి. మరి జగన్ ఎవరి మాట వింటారు అన్న ప్రశ్నకు రెండు పేర్లు కన్పిస్తాయి. 1. సజ్జల రామకృష్ణారెడ్డి. 2. విజయసాయిరెడ్డి. నిజానికి జగన్ వివిధ కేసులలో ఇరుక్కున్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి జగన్ కు వెన్నుదన్నుగా నిలిచారు. ఒకప్పుడు జగన్ ఆత్మగా విజయసాయిరెడ్డి వ్యవహరించే వారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని క్రమంగా దూరం పెడుతున్నట్లు కన్పిస్తుంది.

నెంబర్ టూ పొజిషన్ లో….

2019 ఎన్నికలకు ముందు వరకూ విజయసాయిరెడ్డి పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించారు. విజయసాయిరెడ్డిని జగన్ కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు. అక్కడి రాజకీయాలనే ఆయన చూసుకోమని చెప్పారు. దీంతో పాటు ఢిల్లీలో కొన్ని బాధ్యతలను కూడా విజయసాయిరెడ్డికి మొన్నటి వరకూ అప్పగించారు. విజయసాయిరెడ్డి వల్లనే రఘురామ కృష్ణంరాజు హర్ట్ అయి పార్టీకి దూరమయ్యారన్న కామెంట్స్ కూడా లేకపోలేదు.

పీకే టీం ఎంట్రీతో….

ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డికి మరో ముప్పు పొంచి ఉంది. ఇక మొత్తం ప్రశాంత్ కిషోర్ చేతుల్లోకి రాష్ట్ర పార్టీ వెళ్లనుంది. పీకే టీం సలహాలు, సూచనల మేరకే ఇక టిక్కెట్లయినా మరొకటయినా. అందుకే ఉత్తరాంధ్రలోనూ ఇక వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి మాట వినే అవకాశం లేదు. ఇప్పటి వరకూ ప్రతి పదవి ఆయన సిఫార్సు మేరకే నడుస్తుండటంతో అందరూ ఆయన చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. కానీ ఇకపై పీకే టీందే పెత్తనం కావడంతో నేతలు కూడా ఆయనను లైట్ తీసుకుంటారు.

ఢిల్లీలోనూ….

ఇక ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డి పెత్తనానికి చిల్లుపడినట్లే. ఇక్కడ ఇప్పటికే మిథున్ రెడ్డి బాధ్యతలను చూస్తున్నారు. దీనికి తోడు కొత్తగా చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ పొందిన ఆదిత్యానాధ్ దాస్ ను ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు. ఆయన పనులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేసుకోవడమే. అంటే పరోక్షంగా విజయసాయిరెడ్డికి రెండు చోట్ల పెద్ద పని ఏమీ ఉండదన్న టాక్ పార్టీలో నడుస్తుంది.

Tags:    

Similar News