విజయసాయి మీద వారికి కాలిపోతుందట?

విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి విశాఖకు దిగుమతి అయిన పెద్దాయన. అయిదేళ్ళుగా అయన విశాఖను నోడల్ జిల్లాగా మార్చుకుని తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు [more]

Update: 2020-11-12 14:30 GMT

విజయసాయిరెడ్డి. నెల్లూరు నుంచి విశాఖకు దిగుమతి అయిన పెద్దాయన. అయిదేళ్ళుగా అయన విశాఖను నోడల్ జిల్లాగా మార్చుకుని తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అనీ కూడా జగన్ అప్పగించేశారు. ఆయన జగన్ చెవిన వేసి ఏ పని అయినా చేస్తారు. ఎటూ జగన్ గో ఎహెడ్ అంటారు. దాంతో ఇక మూడవ వ్యక్తి మాటకు విలువ లేదు. ఎవరేమి చేప్పిన విజయసాయిరెడ్డి నిర్ణయమే ఫైనల్. నో అప్పీల్. ఇదీ విశాఖ పొలిటికల్ సినారియో. దాంతో వైసీపీ నేతలకు మండుకొస్తోందిట. ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారు కూడా తాము ఏమీ చేయలేమా అని వాపోతున్నారు.

ఎదిరించేశారే…?

విజయసాయిరెడ్డిని ఎదిరించడం అంటే ఒక విధంగా జగన్ ని ఎదిరించినట్లే. ఎందుకంటే జగన్ కి ఏ మాట చెప్పకుండా విజయసాయిరెడ్డి అడుగు ముందుకు వేయరు. అలాగే జగన్ చెప్పినదే ఆయన చేస్తారు. ఇక్కడ సొంత ఆలోచనలు ఏవీ ఆయనకు అసలు ఉండవు. అలాంటిది విజయసాయిరెడ్డిని ఎదిరించి వైసీపీలో ఎవరూ మనలేరు. కానీ చోడవరం ఎమ్మెల్యే సీనియర్ నేత అయిన కరణం ధర్మశ్రీ జిలా సమీక్షా సమావేశంలో ఏకంగా రెడ్డి గారినే ఢీ కొట్టారు. కోరి ముప్పు తెచ్చుకున్నారని అంటున్నారు. ఆ సమావేశంలో విజయసాయిరెడ్డి అన్నది భూములు ఆక్రమణలు విశాఖలో ఎక్కువగా జరుగుతున్నాయని మాత్రమే, తమ దృష్టికి వస్తే ఈ విషయంలో స్వపక్షం, విపక్షం కూడా తేడా చూడమని కూడా హెచ్చరించారు. దాంతో భుజాలు తడుముకున్న ధర్మశ్రీ అడ్డంగా దొరికారు.

దందాయేనా…?

ఏ అర్హతా లేని ఒక మాజీ సైనికుని భూమిగా చెప్పబడుతున్న దాన్ని ధర్మశ్రీ బంధువులు విశాఖ జిల్లా ఆనందపురంలో కొనుగోలు చేసారట. దానికి క్లియరెన్స్ ఇప్పించేందుకు ధర్మశ్రీ గట్టిగానే పైరవీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆనందపురంలో కోట్లలో విలువ చేసే ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని అధికారులు అంటున్నారు. ఇలాంటి వాటిమీదనే విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపించారు. మనం విపక్షం భూదందాలను బయట పెడుతున్నాం, వాటి మీద మాట్లాడుతున్నాం, యాక్షన్ కూడా తీసుకుంటున్నాం, అలాంటపుడు మనం ఎక్కడా తప్పు చేయకూడదు అని విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు హిత బోధ చేస్తున్నారు. దాంతోనే పార్టీ నేతలకు ఎక్కడో కాల్తోందిట.

ఇంకా ఉన్నారుగా..?

విజయసాయిరెడ్డి మాటలకు ఆ సమావేశంలోనే కౌంటర్ ఇచ్చేసిన ధర్మశ్రీ తమ బంధువుల భూముల్లో ఎలాంటి వివాదాలు లేవని చెప్పుకున్నారు కానీ ఆయన భుజాలు తడుకుని తనకు తానుగా దొరికారు అని అంటున్నారు. ఇక ఇలాంటి కేసులు వైసీపీలో చాలా ఉన్నాయట. కొంత మంది ఎమ్మెల్యేలు భూ దందాల్లో చిక్కుకున్నారని కూడా సాయిరెడ్డి దగ్గర కచ్చితమైన నివేదికలు ఉన్నయట. వాటి విషయంలో అధికారులు కఠినంగా ఉండాలని సాయిరెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. అది ముఖ్యమంత్రి జగన్ మాటగా కూడా చెప్పేశారు. మరి అధికారంలోకి వచ్చింది చిన్నపాటి పలుకుబడి తో ఇలాంటి పనులైనా చేసుకోకపోతే ఎలా అని వైసీపీ నాయకులు నలుగుతున్నారు. ఎమ్మెల్యేలు అయితే రగులుతున్నారు. వీరికి తెర వెనక ఒక సీనియర్ మంత్రి మద్దతు కూడా ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి పొగ పెట్టేందుకు సొంత పార్టీలోనే రంగం సిద్ధమవుతోందిట. ఇలా ఎన్ని చేసినా జగన్ ఆయన పక్షం కాబట్టి ఏమీ కాదని సాయిరెడ్డి అనుచరులు అంటున్నారుట.

Tags:    

Similar News