రాములమ్మకు నాటి ఆదరణ లేదా?

సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరారు. సరే. ఆమెకు అధిష్టానం నుంచి ఏం హామీ లభించింది? విజయశాంతికి ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? అన్న చర్చ పార్టీలో జోరుగా [more]

Update: 2021-01-10 09:30 GMT

సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరారు. సరే. ఆమెకు అధిష్టానం నుంచి ఏం హామీ లభించింది? విజయశాంతికి ఎలాంటి పదవి ఇవ్వనున్నారు? అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. గతంలో బీజేపీ లో ఉన్పప్పటి ప్రాధాన్యత ఈసారి విజయశాంతికి లభిస్తుందా? అన్నది కూడా అనుమానమే. విజయశాంతి మాత్రం బీజేపీలో తాను కంఫర్ట్ గానే ఉన్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీలో చేరిన తర్వాత విజయశాంతి కొంత దూకుడుగానే వెళుతున్నారు.

ఆమె ఎంట్రీతో…..

అయితే విజయశాంతి ఎంట్రీతో పార్టీ బలం పెరుగుతుందా? అంటే దానికి మాత్రం సమాధానం లేదు. ఆమె కండువా కప్పించుకోవడానికే చిన్న స్థాయి నేతలని పక్కకు పెట్టారు. జేపీ నడ్డా వచ్చేంత వరకూ ఆమె పార్టీలో చేరలేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న విజయశాంతికి పార్టీలో పదవి ఇవ్వవద్దని ఇప్పటికే బీజేపీలోని పాతవర్గం డిమాండ్ తీసుకువస్తుంది. బీజేపీ సీనియర్ నేత మురళీధరరావుకు కూడా కొందరు నేతలు దీనిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కీలక పదవి వద్దంటూ…..

విజయశాంతికి ఇప్పటికే అనేక పార్టీలు మారారు. తొలుత బీజేపీలో ఉన్నప్పుడు ఆమెకు ప్రాధాన్యత లభిచింది. అయితే అది అద్వానీ కాలం. తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లారు. అక్కడి నుంచి కాంగ్రెస్ లోకి మారారు. ఏ పార్టీలో ఉన్నా ఆమె యాక్టివ్ పాలిటిక్స్ కు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే బయటకు వచ్చే విజయశాంతిని నమ్ముకోవడం వేస్ట్ అని పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర నాయకత్వం మాత్రం….

విజయశాంతికి భవిష్యత్ లో రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ లభించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ హామీని అమిత్ షా ఇచ్చారా? లేదా జేపీ నడ్డా ఇచ్చారా? అన్నది మాత్రం చెప్పడం లేదు. రానున్న తమిళనాడు ఎన్నికల్లోనూ విజయశాంతిని ప్రచారానికి పంపాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తేనే వెళతానని విజయశాంతి ఇటీవల రాష్ట్ర అగ్రనేతలతో చెప్పినట్లు తెలిసింది. అయితే విజయశాంతికి బీజేపీ లో ఎలాంటి పదవి ఇవ్వనున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News