కెప్టెన్ లెక్కలు అవే… అంకెలను బట్టే?

తమిళనాడులో చెప్పుకోదగ్గ నేతల్లో విజయకాంత్ ఒకరు. కెప్టెన్ గా ఆయనకు సినిమా రంగంలో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించిపెట్టింది. అయితే సీని రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన [more]

Update: 2020-09-08 16:30 GMT

తమిళనాడులో చెప్పుకోదగ్గ నేతల్లో విజయకాంత్ ఒకరు. కెప్టెన్ గా ఆయనకు సినిమా రంగంలో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించిపెట్టింది. అయితే సీని రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ తొలి ఎన్నికల్లోనే 18 అసెంబ్లీ సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలోకి అడుగుపెట్టగలిగారు. అయితే ఆ తర్వాత పెద్దగా ఆయన విజయాలు సాధించింది లేదు. ఒంటరి పోరు చేస్తే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నష్టపోతామని కెప్టెన్ విజయకాంత్ కు తెలియంది కాదు.

ఒంటరి పోటీ అంటూ…..

అయితే విజయకాంత్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన సతీమణి ప్రేమలత పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తామని పార్టీ నేతలకు హేమలత చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుకోవాలన్నదే కెప్టెన్ నిర్ణయమని కూడా ఆమె పార్టీ క్యాడర్ కు వివరించారు. దీంతో విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని భావించారు.

అంత సీన్ లేదు…..

కానీ అక్కడే ట్బిస్ట్ ఉందట. ఇది ప్రధాన పార్టీలకు సంకేతాలు పంపడమే నంటున్నారు. విజయకాంత్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి నష్టం జరుగుతుందన్నది చెప్పలేరు. కొన్ని నియోజకవర్గాల్లో డీఎంకేకు, మరికొన్ని నియోజకవర్గాల్లో అన్నాడీఎంకేకు నష్టం జరగుతుంది. ఈ సంగతి తెలిసి తమ వద్దకు కాళ్లబేరానికి వస్తారన్నది విజయ్ కాంత్ వ్యూహంగా కన్పిస్తుంది. విజయకాంత్ కు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే శక్తి, సామర్థ్యం విజయకాంత్ కు లేవు.

ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే…..

విజయకాంత్ ఇప్పటికే అనారోగ్యం పాలయ్యారు. విదేశాలకు వెళ్లిశస్త్ర చికిత్సలు చేయించుకుని వచ్చారు. ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా పాల్గొనే అవకాశం లేదు. దీంతో ఆయన సొంతంగా పోటీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విజయకాంత్ పార్టీ అన్నాడీఎంకే కూటమిలో ఉంది. ఆ కూటమి నుంచి బయటకు రావాలని యోచిస్తున్నారు. డీఎంకే కూడా విజయకాంత్ తో పొత్తుకు ప్రయత్నిస్తుంది. అయితే ఎక్కువ స్థానాలు ఎవరు ఆఫర్ చేస్తే వారికే విజయకాంత్ మద్దతిచ్చే అవకాశముంది. సీట్ల సంఖ్యను బట్టి పొత్తు ఖరారు ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News