బద్వేల్ విజయమ్మ.. ఏమయ్యారు? ఎక్కడున్నారు?
రాజకీయాల్లో కీలక నేతలుగా మహిళలు రాణిస్తున్నారనే విషయం.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన విజయమ్మను చూస్తే.. ఇట్టే అర్ధమవుతుంది. టీడీపీ నాయకురాలిగా.. రెండున్నర దశాబ్దాలకు పైగా [more]
రాజకీయాల్లో కీలక నేతలుగా మహిళలు రాణిస్తున్నారనే విషయం.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన విజయమ్మను చూస్తే.. ఇట్టే అర్ధమవుతుంది. టీడీపీ నాయకురాలిగా.. రెండున్నర దశాబ్దాలకు పైగా [more]
రాజకీయాల్లో కీలక నేతలుగా మహిళలు రాణిస్తున్నారనే విషయం.. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన విజయమ్మను చూస్తే.. ఇట్టే అర్ధమవుతుంది. టీడీపీ నాయకురాలిగా.. రెండున్నర దశాబ్దాలకు పైగా ఇక్కడ ఆమె చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైనా.. ఆమెకు సంబంధం లేదు. ఆమె దూకుడుకు ఎవరూ బ్రేకులు వేయలేరు. తాను అనుకున్నది సాధించే తత్వం ఆమె సొంతం.. ఇదీ.. విజయమ్మ గురించి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు. వైఎస్ జగన్ సొంత జిల్లాలో కీలక నియోజకవర్గంలో.. చక్రం తిప్పిన.. విజయమ్మ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తండ్రి వారసత్వంతో…
తండ్రి బిజివేముల వీరారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయమ్మ.. తనదైన శైలిలో ఇక్కడ టీడీపీని నడిపించారు. పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడంతోపాటు.. శ్రేణులను ఆకర్షించడంలోను.. ఇతర పార్టీల నేతలను .. టీడీపీలోకి చేరేలా ప్రోత్సహించడంలోనూ విజయమ్మకు విజయమ్మే సాటి అంటారు పరిశీలకులు. ఆమె ఉప ఎన్నికల్లో ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బద్వేల్ రిజర్వ్ అయినా కూడా ఆమె రాజకీయాలు ఆగలేదు. పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆమె బద్వేల్‌లో కేడర్ చెదిరిపోకుండా కాచుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు….
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విజయమ్మ తన విశ్వరూపం చూపించారు. వైసీపీ తరఫున బద్వేల్ నుంచి విజయం సాధించిన జయరాములును టీడీపీలోకి చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా వైసీపీకి నియోజకవర్గంలో చెక్ పెట్టే విషయంలో విజయమ్మ అందరికన్నా.. ఒక అడుగు ముందే ఉన్నారని అంటారు. ఇక, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పతాకాన్ని ఎగరేయాలని ఆమె ఎంతో శ్రమించారు. అయితే.. వైసీపీ సునామీ కారణంగా టీడీపీ విజయం దక్కించుకోలేక పోయింది. ఇక, ఆ తర్వాత .. విజయమ్మ సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కానీ, ప్రజలను కలుసుకునేందుకు కానీ, నేతలను సమీకరించేందుకు కానీ ఆమె ముందుకు రావడం లేదు. దీంతో కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
అంతా ఆయనే…
ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్.. అన్నీతానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన విజయమ్మ.. ఉప ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారనేది కీలక ప్రశ్న. జగన్ సర్కారు దూకుడుతో చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకని ఆమె భావిస్తున్నారా? లేక.. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని భావిస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి