వివేకా హత్యపై.. విజయమ్మ స్పందన ఎందుకు.. ఏం జరిగింది ?
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్ల పాటు మౌనంగా ఉన్న సీఎం జగన్ మాతృమూర్తి.. [more]
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్ల పాటు మౌనంగా ఉన్న సీఎం జగన్ మాతృమూర్తి.. [more]
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు అంటే.. దాదాపు రెండేళ్ల పాటు మౌనంగా ఉన్న సీఎం జగన్ మాతృమూర్తి.. వైసీపీ గౌరవాధ్యక్షురాలు.. విజయలక్ష్మి ఎట్టకేలకు ఇప్పుడు స్పందించారు. నిజానికి ఆమె ఈ విషయంలో ఇంత హుటాహుటీన స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే.. ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు ఆమె స్పందన వెనుక.. వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌కు కుటుంబం నుంచి సెగ తగులుతోంది. కుటుంబ సభ్యుల సహకారం మాట అటుంచితే.. ఆయన కుటుంబాన్ని ఎరగా చూపుతూ.. వ్యతిరేక మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
కుటుంబంలో చీలికలు వచ్చాయని….
ఎన్నడూలేనిది వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయని,, ఇద్దరు చెల్లెళ్లు (షర్మిల, వివేకా కుమార్తె సునీత) కూడా జగన్‌పై కత్తి కట్టారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవ, అవాస్తవాలు ఎలా ఉన్నా ఇటు షర్మిల, సునీత వ్యవహార శైలీ చూస్తుంటే ఇది నిజం అనిపించేలా ఉంది. ఈ పరిణామం.. రాజకీయంగా జగన్‌కు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయన అనూహ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా.. జగన్ విషయంలో సానుకూలత వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలోనే విజయలక్ష్మిని రంగంలోకి దింపారని అంటున్నారు.
మరింత డ్యామేజీ కాకుండా…?
జగన్ వ్యతిరేకత మీడియా దీనిని ఎలాగూ హైలెట్ చేసి రాస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో జనసేనాని పవన్.. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని ప్రస్థావించారు. దీంతో విజయలక్ష్మి అనూహ్యంగా స్పందించారు. మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందేనని ఆమె అన్నారు. ఈ హత్యపై సీఎం జగన్, షర్మిల, తనది ఒకే మాట అని స్పష్టం చేశారు. జగన్‌ను ఎల్లో మీడియాతో పాటు పవన్ పనికట్టుకునే టార్గెట్ చేస్తోన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కూడా ఆమె కోరిన సంగతి విదితమే. ఇది జగన్‌కు మరింత డ్యామేజ్ అవుతుందనే విజయలక్ష్మి రంగంలోకి దిగి దీనికి చెక్ పెట్టేశారని వైసీపీ వర్గాల టాక్ ?