విజయశాంతి పేరు డిలీట్ చేయాల్సేందేనా?
కొందరు ఎందుకు పార్టీలో ఉంటారో తెలియదు. పార్టీకి తమ అవసరం అనుకుంటారో ఏమో తెలియదు కాని ఎన్నికల తర్వాత అస్సలు కన్పించరు. మళ్లీ ఎన్నికలు వస్తేనే వారు [more]
కొందరు ఎందుకు పార్టీలో ఉంటారో తెలియదు. పార్టీకి తమ అవసరం అనుకుంటారో ఏమో తెలియదు కాని ఎన్నికల తర్వాత అస్సలు కన్పించరు. మళ్లీ ఎన్నికలు వస్తేనే వారు [more]
కొందరు ఎందుకు పార్టీలో ఉంటారో తెలియదు. పార్టీకి తమ అవసరం అనుకుంటారో ఏమో తెలియదు కాని ఎన్నికల తర్వాత అస్సలు కన్పించరు. మళ్లీ ఎన్నికలు వస్తేనే వారు కన్పిస్తారు. రాజకీయాల్లో వీరిని పార్ట్ టైం పొలిటీషియన్లు అనుకున్నప్పటికీ కొన్ని కీలక సమయాల్లోనూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి ఎన్నికలప్పుడే కన్పిస్తారన్నది వాస్తవం.
ఉప ఎన్నికలో కూడా…..
ఇప్పుడు మెదక్ జిల్లా దుబ్బాక నియోజవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా చెరకు శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. గతంలో విజయశాంతి మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. తన జిల్లా పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక ను కూడా విజయశాంతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కనీసం పార్టీ ప్రచారానికి కూడా ఆమె ముందుకు రాకపోవడంతో పార్టీ పట్ల విజయశాంతికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో ఇలాగే అర్థమవుతుంది.
లోకల్ లీడర్లంటేనే….
విజయశాంతికి ఫైర్ బ్రాండ్ గా పేరు. ఆమె లోకల్ లీడర్లను అస్సలు లెక్క చేయరు.పార్టీ మారినప్పుడు కూడా నేరుగా జన్ పథ్ కు వెళ్లి చేరి వచ్చారు. పార్టీ కూడా ఆమెకు సముచిత స్థానమే కల్పించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలను కూడా ఇచ్చారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన విజయశాంతి తర్వాత పత్తా లేకుండా పోయారు. ఆమె అస్సలు గాంధీ భవన్ వైపు కూడా చూడరు.
స్థానిక నాయకత్వంపై…..
విజయశాంతి గత కొంతకాలంగా కాంగ్రెస్ స్థానిక నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదని, దానిని మాత్రం సీనియర్ నేతలు అంగీకరించే పరిస్థితుల్లో లేరని విజయశాంతి అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోవడానికి స్థానిక నాయకులే కారణమని ఆమె తన సన్నిహితుల వద్ద అనేకసార్లు వ్యాఖ్యానించారు కూడా. అందుకే ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో ఎదగలేదని భావించిన విజయశాంతి పార్టీకి పూర్తిగా దూరమయినట్లు కన్పిస్తుంది. కాంగ్రెస్ జాబితా లోనుంచి విజయశాంతి పేరును ఇక తొలగించాల్సి వస్తుందేమోనన్న వ్యాఖ్యలు గాంధీభవన్ లో విన్పిస్తున్నాయి.