లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారే?

పెన్మత్స విష్ణుకుమార్ రాజు. బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం సాధించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న [more]

Update: 2020-04-18 12:30 GMT

పెన్మత్స విష్ణుకుమార్ రాజు. బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజయం సాధించారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు. మ‌రి ఆయ‌న రాజ‌కీయ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఏవిధంగా రాజ‌కీయ లైఫ్‌ను ప్లాన్ చేసుకున్నారు ? ఇప్పుడు బీజేపీలో ఆయ‌న ప‌రిస్థితి ఏంటి ? అన్న ప్శ్న‌ల‌కు ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ క‌ష్టమేనా అన్న ఆన్సర్లే వ‌స్తున్నాయి. వాస్తవానికి వీటి గురించి చ‌ర్చించుకునే ముందు.. ఒక్క‌సారి విష్ణుకుమార్ రాజు వ్యవ‌హార శైలిని కూడా చ‌ర్చించుకోవాల్సిన అవస‌రం ఉంది. ఆయ‌న బీజేపీలో ఉన్నా.. ఆపార్టీ సిద్ధాంతం మేర‌కు ఎప్పుడూ బ‌లంగా మాట్లాడింది లేదు. పోనీ బీజేపీలో కీల‌కంగా ఉన్న నాయ‌కుల‌తో ఆయ‌న పెద్దగా ట‌చ్‌లో ఉన్నది కూడా లేదు. వారి వ‌ర్గంగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకోలేదు.

తటస్థుడిగానే..?

పార్టీ త‌ర‌ఫున గెలిచిన త‌ర్వాత విష్ణుకుమార్ రాజు బీజేపీ వాయిస్‌ను వినిపించ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. పార్టీలో నాయ‌కులు అంద‌రూ పార్టీ వాయిస్ వినిపిస్తే.. విష్ణు మాత్రం త‌ట‌స్థ వాయిస్ వినిపించేవారు. ఆయ‌న పార్టీ అవ‌స‌రాల క‌న్నా త‌న సొంత జెండా, ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయ‌న భ‌జ‌న చేయ‌డంలో విష్ణుకుమార్ రాజు ముందుండే వార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు చెవులు కొరుక్కునేవి. గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వంతో బీజేపీ విభేదించి, మంత్రులు రాజీనామా చేసిన త‌ర్వాత కూడా విష్ణు చంద్రబాబు ప్రభుత్వంపై పొగ‌డ్తల వ‌ర్షం కురిపించిన సంద‌ర్భం అసెంబ్లీలోనే క‌నిపించింది.

మూడో స్థానంలోకి…..

అదే స‌మ‌యంలో విష్ణుకుమార్ రాజు ప్రత్యేక హోదా విష‌యంలోనూ త‌న‌దైన శైలిలో స్పందించి.. అస‌లు ఈయ‌న బీజేపీ నాయ‌కుడేనా ? అనే సందేహాలు వ్యక్తమ‌య్యేలా వ్యవ‌హ‌రించారు. దీంతో ఆయ‌న పార్టీలో సీనియ‌ర్ నాయకుడే అయిన‌ప్పటికీ.. పార్టీలో మాత్రం త‌న‌కంటూ ప్రత్యేకంగా ఓ వేదిక‌ను మాత్రం ఏర్పాటు చేసుకోలేక పోయారు. అదేవిధంగా ఓ వ‌ర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేక పోయారు. ఈ ప‌రిణామం విష్ణుకు రాజ‌కీయంగా ఇబ్బంది క‌లిగించింది. గ‌త ఏడాది ఆయ‌న టికెట్ తెచ్చుకున్నా.. గెలుపు విష‌యం మాట అటుంచితే మూడో స్థానానికి ప‌డిపోయారు. 2014లో 82 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకుని విజ‌యం సాధిస్తే.. గ‌త ఏడాది 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న‌కు కేవ‌లం 18 వేల ఓట్లు వ‌చ్చాయి. ఎక్కడి నుంచో వ‌చ్చి ఇక్కడ పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు 72 వేల ఓట్లు తెచ్చుకుని ఘ‌న విజ‌యం సాధించారు.

ఇక ముగిసినట్లేనా?

వాస్తవానికి గంటా త‌న‌కు పోటీనే కాద‌ని చెప్పుకొచ్చిన విష్ణుకుమార్ రాజు ఎన్నిక‌ల వ్యూహాన్ని అనుస‌రించ‌డంలోను, పార్టీ విధానాన్ని ప్రజ‌ల‌లోకి తీసుకు వెళ్లడంలోనూ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు కూడా జ‌గ‌న్ ప్రభుత్వాన్ని కొన్ని సార్లు పొగ‌డడం, మ‌రికొన్ని సార్లు.. జ‌గ‌న్‌ను మెచ్చుకోవ‌డం వంటి ప‌రిణామాలు.. అదే స‌మ‌యంలో రాజ‌ధాని ఆందోళ‌న‌ల‌ను కూడా పొగ‌డ‌డం వంటివి బీజేపీలో ఆయ‌న‌ను ఒంట‌రిని చేశాయి. ఈ క్రమం లోనే విష్ణు ప‌రిస్థితి ఏంటి? రాజ‌కీయంగా ఆయ‌న వ్యూహాత్మకంగా ముందుకు సాగ‌లేక పోతున్నారా? అతి పెద్ద బీజేపీలో ఆయన ఒంట‌రి వాడ‌య్యారా ? అనే సందేహాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇక ఇప్పుడు కీల‌క‌మైన వైజాగ్‌లో బీజేపీ నుంచి ఎమ్మెల్సీ మాధ‌వ్ వాయిస్ బ‌లంగా విన‌ప‌డుతోంది. ఈ లెక్కన చూస్తుంటే విష్ణుకుమార్ రాజు బీజేపీ రాజ‌కీయం ముగిసిన‌ట్టే అంటున్నారు.

Tags:    

Similar News