గవర్నర్ జోక్యం చేసుకుంటారా…?

ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాదిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకు ముందు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. వాటి మీద ప్రభుత్వం ఓ వైపు సుప్రీం [more]

Update: 2021-02-01 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాదిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకు ముందు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. వాటి మీద ప్రభుత్వం ఓ వైపు సుప్రీం కోర్టులో పోరాటం చేస్తూండంగానే ఆ పార్టీ మద్దతుదారులు అయితే న్యాయ వ్యవస్థ మీదనే కొన్ని కామెంట్స్ చేయడం దాని మీద కోర్టు సీరియస్ కావడం వంటివి జరిగాయి. ఆ కధ అలా ఉండగానే గత ఏడాది మార్చి నుంచి ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన సడెన్ గా ఎన్నికలు వాయిదా వేయడంతో వైసీపీ సర్కార్ కి ఆయనకూ మధ్య చెప్పలేనంత ఆగాధం ఏర్పడిపోయింది.

ఏపీలో రాజ్యాంగ సంక్షోభమా…?

రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది అంటూ ఈ మధ్య తరచూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజానికి అది ఎంతవరకూ అన్నది పక్కన పెడితే విపక్షాల రచ్చ మాత్రం తారస్థాయిలో ఉంది. మరో వైపు ఎన్నికల సంఘం అంటే ఒక రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటుంది. మరి మంత్రులు కూడా ప్రభుత్వంలోని వారే. వారే ఎన్నికల సంఘం మీద విమర్శలు చేయడాన్ని చూస్తే ఇక్కడ రాజ్యాంగ పరమైన తేడా ఏదో ఉందని అర్ధమవుతోంది అంటారు. మంత్రులు ఇతర వైసీపీ నాయకులు ఏకంగా నిమ్మగడ్డను టార్గెట్ చేయడం కూడా తప్పుగా చెబుతున్నారు రాజ్యాంగ నిపుణులు.

రాజ్యాంగ ధిక్కరణేనా…?

ఇక సుప్రీం కోర్టు తీర్పుని గౌరవిస్తూ తాము ఎన్నికలకు రెడీ అంటున్న మంత్రులు ఇతర ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డని అదే సమయంలో విమర్శించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అన్న చర్చ కూడా ఉంది. నిమ్మగడ్డ తన పరిధిలో లేని అధికారాలను ఉపయోగిస్తే కనుక కోర్టు మెట్లు ఎక్కవచ్చు. అదంతా సైలెంట్ గా జరగాల్సిన వ్యవహారం. ఇలా నోరు పారేసుకోవడం వల్ల ఒరిగేది కూడా ఏమీ ఉండదు. దాని వల్ల మరింతగా రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడుతున్నారు అని ప్రతిపక్షాలు కూడా విమర్శించడానికే అవకాశం కల్పిస్తున్నారు అనుకోవాలి.

ఆయన పాత్ర అలా…

ఈ కీలకమైన సమయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని విపక్షాలు కోరుతున్నాయి. గవర్నర్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి మాట్లాడారు. అయితే నిమ్మగడ్డ కొందరు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతూ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న చర్చ కూడా ఉంది. దీని మీద నిమ్మగడ్డ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ వర్గాలతోనే ఏపీలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తారు అంటున్నారు. మరో వైపు గవర్నర్ సడెన్ ఎంట్రీ ఇస్తే మాత్రం అనూహ్యమైన పరిణామాలు కూడా ఏపీలో చోటు చేసుకుంటాయా అన్న చర్చ కూడా ఉంది. దీని మీద టీడీపీ నేత సబ్బం హరి అయితే గవర్నర్ ఏపీ సర్కార్ రాజ్యాంగ పరంగా విఫలం అయింది అని కేంద్రానికి నివేదిస్తే చాలు ఏపీ సర్కార్ కుప్ప కూలుతుంది అంటున్నారు. మరీ అంత ఈజీగా ఒక ప్రభుత్వం పడిపోదు కానీ ఏపీ పరిణామాల మీద కేంద్రం సీరియస్ గా ఉంటే మాత్రం ఏం జరుగుతాయో చెప్పలేమన్నది అన్నదే ఒక విశ్లేషణ.

Tags:    

Similar News