Vivek : వివేక్ కు ఎందుకో అంత ప్రయారిటీ?
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనేకం మారనున్నాయి. ఫలితాన్ని బట్టి అధికార పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అయితే కొందరు కీలక నేతలకు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనేకం మారనున్నాయి. ఫలితాన్ని బట్టి అధికార పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అయితే కొందరు కీలక నేతలకు [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనేకం మారనున్నాయి. ఫలితాన్ని బట్టి అధికార పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అయితే కొందరు కీలక నేతలకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే వలవేస్తుందంటున్నారు. మాజీ ఎంపీ వివేక్ ను టీఆర్ఎస్ లోకి తీసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు మంతనాలు కూడా ప్రారంభించినట్లు తెలిసింది. అయితే వివేక్ దీనిపై ఎలాంటి నిర‌్ణయం తీసుకోలేదు. బీజేపీలోనే కొనసాగుతారంటున్నారు.
ఇమేజ్ తగ్గుతుందా?
అయితే మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటం, బీజేపీకి ఎదురు గాలులు వీస్తుండటంతో ఆయన పునరాలోచనలో పడే అవకాశముందంటున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి వివేక్ రాజకీయంగా ఖాళీగా ఉన్నారు. ఈ కుటుంబంలో ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వివేక్ దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర విభజన తర్వాత వివేక్ టీఆర్ఎస్ లో చేరారు.
దుబ్బాక లో కీలకంగా…
2019 ఎన్నికలలో టీఆర్ఎస్ టిక్కెట్ దక్కక పోవడంతో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ ఇటీవలే ఆయనను జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా తీసుకుంది. వివేక్ ఆర్థికంగా, సమాజికంగా బలవంతుడు కావడంతో బీజేపీ ఆయనను వదలిపెట్టే అవకాశాలు లేవు. దుబ్బాక నియోజకవర్గంలో వివేక్ అంతా తానే అయి పార్టీని గెలిపించారు. అప్పుడే ఆయన అమిత్ షా దృష్టిలో పడ్డారు. ఇప్పుడు హజూరాబాద్ ఉప ఎన్నికలను కూడా ఆయనే దగ్గరుండి చూస్తున్నారు.
రాజ్యసభ ఆఫర్….
కానీ బలమైన నేత కావడం, మీడియా అధినేత కావడంతో టీఆర్ఎస్ కూడా వివేక్ వైపు మొగ్గు చూపుతుంది. ఆయనను పార్టీలోకి తీసుకుని రాజ్యసభ ఇవ్వాలని రాయబారం నడిపింది. అయితే దీనిపై వివేక్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత మాత్రం వివేక్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. బీజేపీకి ఇక్కడ చోటు లేదని భావిస్తే తిరిగి ఆయన అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమవుతారంటున్నారు.