అండర్ స్టాండింగ్ అదేనా?

కేసీఆర్..జగన్ మిత్రులా శతృవులా అంటే ఎవరూ ఠక్కున జవాబు చెప్పలేరు. ఈ రెండింటికీ మించి ఒక బంధమేదో అండర్ కరెంట్ గా ఉందని తలపండిన చంద్రబాబు లాంటి [more]

Update: 2021-06-24 08:00 GMT

కేసీఆర్..జగన్ మిత్రులా శతృవులా అంటే ఎవరూ ఠక్కున జవాబు చెప్పలేరు. ఈ రెండింటికీ మించి ఒక బంధమేదో అండర్ కరెంట్ గా ఉందని తలపండిన చంద్రబాబు లాంటి వారు మాత్రమే అర్ధం చేసుకుంటారు. కేసీఆర్ నీటి కొట్లాట తెచ్చి జగన్ ని గజదొంగ అంటున్నారు. ఇది గల్లీలో సాగుతున్న యుధ్ధం. దీని వల్ల అటు కేసీఆర్ కి ఇటు జగన్ కి కూడా రాజకీయ లాభమే. కేసీఆర్ తన ప్రాంతం కోసం పోరాడుతున్నట్లుగా కలరింగ్ ఇస్తూంటే జగన్ ని తిడుతున్న తిట్లతో ఏపీకి జగన్ మేలు చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఇక్కడి జనాలలో వస్తుంది. మొత్తానికి ఇది కూడా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ తో సాగుతున్న రాజకీయమే అని అనుమానాలు రావచ్చు.

కూడబలుక్కున్నారా…?

ఇక ఢిల్లీలో చూస్తే యాంటీ మోడీ క్యాంపులు జోరుగా సాగుతున్నాయి. మోడీ ఇక వద్దు, ఆయన మాజీ ప్రధాని కావాల్సిందే అంటూ విపక్షాలు కూటములు కడుతున్నాయి. అలా హస్తినలో తలపండిన ప్రతిపక్ష రాజకీయ నేతలు తెగ ఆయాసపడుతూంటే తమకేమాత్రం పట్టనట్లుగా జగన్, కేసీఆర్ ధిలాసాగా తమ రాజకీయ కోటలలో ఉన్నారు. ఇద్దరూ చోద్యం చూస్తున్నారు. అంటే గల్లీలో కొట్టుకున్నట్లుగా కనిపిస్తున్న ఈ ఇద్దరూ ఢిల్లీలో మాత్రం ఒకే లైన్ లో వెళ్తున్నారు అంటున్నారు. ఈ ఇద్దరూ మోడీ యాంటీ క్యాంప్ కి దగ్గర మాత్రం కారన్నది స్పష్టం.

అందుకే అలా ….

కేసీఆర్ విషయానికి వస్తే ఒక బిగ్ టార్గెట్ ఉంది. 2023 చివర‌లో జరిగే శాసన సభ ఎన్నికల తరువాత తన కొడుకు కేటీయార్ ని ముఖ్యమంత్రిని చేయాలి. అదే ఆయనకు అతి ముఖ్యం. అందుకోసం ఆయన కేంద్రంతోనూ, మోడీతోనూ అసలు కయ్యం పెట్టుకోరు. అవినీతి ఆరోపణలతో కేసీఆర్ జైలుకు పోతాడు అని బీజేపీ నేతలు ఎన్ని కలలు కన్నా కూడా ఆయన మీద మోడీ షాల కరుణ అలా కురుస్తూ ఉంటుందని అంటారు. మోడీని కేటీయార్ విమర్శిస్తారు కానీ కేసీఆర్ పల్లెత్తు మాట అనరు. దీని వెనక ఎవరి అవసరాలు వారివి. 2024లో బీజేపీకి సీట్లు తగ్గితే కేసీఆర్ ని కూడా లాగేయాలన్నది బీజేపీ ప్లాన్ అయితే మోడీతో రాజకీయ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నది గులాబీ బాస్ ఆలోచన.

అదే శ్రీరామ రక్ష …

ఇక ఏపీలో జగన్ కి బీజేపీకి మధ్య మంచి బాండేజ్ ఉంది. ఆయనకు ఉన్న ఎంపీలు అంతా బీజేపీ కోసమే అన్నట్లుగా ఉంటారు. ఇక 2024లో మరోసారి గెలవడానికి జగన్ పక్కా ప్లాన్ వేసుకున్నారు. కేంద్ర సహకారంతో ఆయన సంక్షేమ పధకాలు రూపకల్పన చేసుకుంటున్నారు. ఇక జగన్ మీద కేసులు ఎటూ ఉన్నాయి. ఆయన రాజకీయం సాఫీగా సాగాలంటే ఏ రకంగా చూసినా కేంద్రం సాయం అవసరం. ఇక మోడీ షాలకు కూడా జగన్ ని మించిన నమ్మకమైన మిత్రుడు ఏపీలో వేరే దొరకరు. జగన్ కి జనంలో ఉన్న అపరిమితమైన ప్రజాదరణ కూడా మోడీ షాలు ఆయన వైపు మొగ్గేలా చేస్తోంది. ఇలా అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరూ తమ వైపే అన్నది బీజేపీ ఆలోచన. వీరు కూడా థర్డ్ ఫ్రంట్ వచ్చిన మరొకరు గద్దెనెక్కినా తమకేంటి లాభం అనుకునే ధోరణీ . ఎటూ మోడీ షాలతో ఫ్రెండ్ షిప్ సాగుతోంది కదా ఇలాగే కానీయ్ అన్నదే తెలుగు అన్నదమ్ముల విధానం. సో తెలియని ఈ బంధం వల్ల అందరి కన్నా ఎక్కువగా నష్టపోతోంది మాత్రం చంద్రబాబే అని చెప్పాలి.

Tags:    

Similar News