బెంగాల్ లోనూ హంగ్ వస్తే….?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. దశల వారీ పోలింగ్ తో నేతల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతుంది. అయితే మహారాష్ట్ర తరహాలో పశ్చిమ [more]

Update: 2021-04-22 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. దశల వారీ పోలింగ్ తో నేతల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతుంది. అయితే మహారాష్ట్ర తరహాలో పశ్చిమ బెంగాల్ లోనూ తాము కింగ్ మేకర్ అవుతామని కాంగ్రెస్, వామపక్షాలు భావిస్తున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల ఫలితాల అనంతరం తమ అవసరం ఇతర పార్టీలకు ఏర్పడుతుందన్న విశ్వాసంలో కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలున్నాయి.

క్యాడర్ లో ఉత్సాహం…..

పశ్చిమ బెంగాల్ లో ఒకప్పుడు కమ్యునిస్టులు దశాబ్దకాలం ఏలారు. ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. మమత బెనర్జీ దెబ్బకు పదేళ్ల నుంచి క్యాడర్ చెల్లాచెదురయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ క్యాడర్ లో ఉత్సాహం కన్పిస్తుంది. బీజేపీ బలపడటం ఇష్టం లేని క్యాడర్ కమ్యునిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పోరాటం చేస్తున్నాు. దీనికితోడు ఐఎస్ఎఫ్ తో జట్టు కట్టడం తమకు లాభిస్తుందని వామపక్షాలు భావిస్తున్నాయి.

కూటమిగా ఏర్పడి…..

పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీలు 171 సీట్లలో పోటీ ేస్తున్నాయి. కాంగ్రెస్ 91 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇక మతతత్వ పార్టీగా ముద్రపడిన ఇండియన్ సెక్యురల్ ఫ్రంట్ 26 సీట్లలో పోటీ చేస్తుంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ను ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించారు. దీంతో ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఈ కూటమికి పడతాయని పెద్ద ఆశలు పెట్టుకున్నాయి. గతంలో ముస్లింలు అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతిచ్చేవారు

సంకీర్ణ ప్రభుత్వం ఖాయమంటూ….

కానీ ఈసారి ఖచ్చితంగా తమవైపై నిలుస్తారని కాంగ్రెస్ కూటమి విశ్వసిస్తుంది. అందువల్ల అనేక నియోజకవర్గాల్లో గెలుపు దిశగా తమ అభ్యర్థులుంటారని భావిస్తుంది. ఈసారి పశ్చిమ బెంగాల్ లో బీజేపీని నిలువరించేందుకు, మమత ను కట్టడి చేసేందుకు బెంగాలీలు తమవైపు మొగ్గు చూపుతారని వామపక్ష పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి. మహారాష్ట్ర తరహాలో ఇక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అందులో తమ భాగస్వామ్యం తప్పనిసరి అని కూటమి నేతలు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News