ఈసారి గెలిపించేది వీరేనట

పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఈసారి కులాలు శాసిస్తున్నాయి. కులాల ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఓబీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయం వరిస్తుందని టీఎంసీ, బీజేపీలు [more]

Update: 2021-04-15 17:30 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఈసారి కులాలు శాసిస్తున్నాయి. కులాల ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఓబీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయం వరిస్తుందని టీఎంసీ, బీజేపీలు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తం ఎనిమిది దశల్లో జరిగే పశ్చిమ బెంగాల్ లో కులాల వారీగా లెక్కలు వేసుకుని మరీ టీఎంసీ, బీజేపీలు బరిలోకి దిగాయి. తమ మ్యానిఫేస్టోలో కూడా కులాలకే ప్రాధాన్యత కల్పించాయి.

యాభై సీట్లలో…..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓబీసీలు క్రియాశీలకంగా ఉన్నారు. దాదాపు యాభై సీట్లలో వీరు ప్రభావం చూపనున్నారు. అందుకోసం వీరిని ఆకట్టుకునేందుకు తొలి నుంచి బీజేపీ, టీఎంసీలు ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఓబీసీలు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. దీంతో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 18 లోక్ సభస్థానాలను గెలుచుకుంది. ఈసారి ఆ పొరపాటు జరగకుండా మమత బెనర్జీ ముందు జాగ్రత్త తీసుకున్నారు.

కులాల వారీగా…

ఓబీసీలతో పాటు మహిషి, తేలి, సాహా వంటి కులాలకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని మమత బెనర్జీ హామీ ఇచ్చారు. దీనికి ధీటుగా బీజేపీ కూడా సమాధానమిచ్చింది. తాము అధికారంలోకి రాగానే మమత అడ్డుకుంటున్న కులాలను తాము ఓబీసీ రిజర్వేషన్ జాబితాలో చేరుస్తామని చెప్పింది. మండల్ కమిషన్ ప్రాతిపదికన మహిష్క, తిల్లి వంటి ఇతర హిందూ కులాలను సయితం ఓబీసీ రిజర్వేషన్లలో చేరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

రెండు పార్టీలూ…..

ఉత్తర 224 పరగణాలు, నాడియా జిల్లాలతో పాటు దక్షిణ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ సామాజికవర్గాలను ఆకట్టుకునేందుకు మమత బెనర్జీ మతువా, ఆదివాసీ, రాజవంశీ, బాగ్డీ, బౌరి వంటి కులాలకు తన మ్యానిఫేస్టోలో చోటు కల్పించారు. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ లో ఈసారి కులాలు ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా సామాజికవర్గాలకు అనుగుణంగానే జరిగింది. దీంతో ఫలితం ఎవరి వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News