వీళ్లంతా పార్టీలో ఉన్నట్లా? లేనట్లా?
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. అధికారంలో లేకపోయినా [more]
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. అధికారంలో లేకపోయినా [more]
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి క్రైసిస్ ను ఎదుర్కొనలేదు. అధికారంలో లేకపోయినా గతంలో టీడీపీ నేతలు యాక్టివ్ గా ఉండేవారు. పార్టీలు వీడినా చంద్రబాబు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లేవారు. కానీ ఈసారి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎక్కువ మంది యాక్టివ్ గా లేరు. ఇక గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసిన వాళ్లలో ఎక్కువ మంది ఇప్పటికే పార్టీని వీడిపోయారు. ఉన్నవారు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
22 స్థానాల్లో ఓటమి పాలయి….
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మిగిలిన 22 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇక ఓటమి చెందిన 22 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికే అనేక మంది పార్టీని వీడిపోయారు. కొందరు వైసీపీలో చేరగా మరికొందరు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరిపోయారు.
వీరంతా ఇతర పార్టీలకు….
అనకాపల్లి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్ధారాఘవరావు వైసీపీ కండువా కప్పేసుకున్నారు. నెల్లూరు అభ్యర్థి బీద మస్తాన్ రావు కూడా ఫ్యాన్ పార్టీ నీడన చేరారు. కాకినాడ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కూడా వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఐదుగురు ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరిపోయి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేశారు. ఇక్కడ కొత్త నాయకత్వాన్ని తెలుగుదేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
వీరు ఆచూకీయే లేదు….
ఇక విశాఖ నుంచి పోటీ చేసిన శ్రీభరత్, అరకు నుంచి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, రాజమండ్రి నుంచి మాగంటి రూప, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్, ఏలూరు నుంచి మాగంటి బాబు, నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల నుంచి శ్రీరాం మాల్యాద్రి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాల నుంచి మాండ్ర శివానందరెడ్డి, రాజంపేట నుంచి పోటీ చేసిన సత్యప్రభ, తిరుపతి నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి లు యాక్టివ్ గా లేరు. వీరంతా మౌనంగా ఉంటున్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. వీరు అసలు పార్టీలో ఉన్నట్లా? లేనట్లా? అన్నది నిర్ణయించాల్సింది చంద్రబాబు మాత్రమే.